వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐతే..ఎపిలో ముందస్తు ఎన్నికలే ఖాయమా?..సిఎం, సీనియర్ మంత్రి నోట ఆ మాటే...

|
Google Oneindia TeluguNews

అమరావతి: సచివాలయంలో జరిగిన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల గురించి కీలక చర్చ జరిగింది. ఆ చర్చల సారాంశాన్ని బట్టి చూస్తే ఎపిలో ముందస్తు ఎన్నికలే ఖాయమనే అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు.

శనివారం సెక్రటేరియట్ లో టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రంలో పరిస్థితి చూస్తే ముందే ఎన్నికలు రావొచ్చని అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చెయ్యగా, యనమల అభిప్రాయాన్ని ఏమాత్రం ఖండించని ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు బదులుగా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలు ఖాయమనే తీరులోనే సాగాయి. అలాగే కేబినెట్ మీటింగ్ అనంతరం సిఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విషయం ప్రస్తావించడం గమనార్హం.

 సీనియర్ మంత్రి...యనమల ఏమన్నారంటే..

సీనియర్ మంత్రి...యనమల ఏమన్నారంటే..

టిడిపి సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా సీనియర్ మంత్రి యునమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ‘‘ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉందనుకోవడానికి వీల్లేదు. ఈ ఏడాది నవంబరు, డిసెంబరులోనే కేంద్రం పార్లమెంటు ఎన్నికలకు వెళ్తుందని ప్రచారం జరుగుతోందని..కేంద్రంలో ఉన్న వాతావరణం చూస్తుంటే అలాగే అనిపిస్తోందని...అలా జరిగితే భాజపా మిత్రపక్షంగా తెదేపా శాసనసభ ఎన్నికలకూ వెళ్లాల్సి ఉంటుంది''...అన్నారు.

 యనమల అభిప్రాయంతో...ఏకీభవించిన చంద్రబాబు...

యనమల అభిప్రాయంతో...ఏకీభవించిన చంద్రబాబు...

సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయాన్నిటిడిపి అధినేత చంద్రబాబు ఏమాత్రం ఖండించపోగా అనంతరం చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలే ఖాయమనే అభిప్రాయాన్ని బలపరచే తీరులో సాగాయి. యనమల వ్యాఖల్యపై చంద్రబాబు స్పందిస్తూ... జన్మభూమి తర్వాత ఎన్నికలకు ఎపి సిద్ధమైనట్టేనని వాఖ్యానించారు. అంతేకాకుండా ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే తమ పార్టీ పరిస్థితి ఏంటనే విషయమై స్పష్టత ఇస్తున్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యలు కొనసాగడం గమనార్హం.

 పరిస్థితి సానుకూలమే...టిడిపి అధినేత..

పరిస్థితి సానుకూలమే...టిడిపి అధినేత..

ముందస్తు ఎన్నికలపై యనమల వ్యాఖ్యలకు బదులుగా చంద్రబాబు తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ...120-130 నియోజకవర్గాల్లో పరిస్థితి సానుకూలంగా ఉంది. 40-50 నియోజకవర్గాల్లో పార్టీ కొంత బలహీనంగా ఉంది. ఇన్‌ఛార్జులు ఉన్న నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఆ పరిస్థితి కనిపిస్తోందని, అలాంటి చోట ఇన్‌ఛార్జులుగా వారినే కొనసాగించాలా, మార్చాలా?...అన్న విషయంలో సమీక్షిస్తానని చెప్పారు.

మీడియా సమావేశంలో కూడా...చంద్రబాబు ఇలా అన్నారు....

మీడియా సమావేశంలో కూడా...చంద్రబాబు ఇలా అన్నారు....

మంత్రిమండలి సమావేశం అనంతరం సిఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ...అన్ని ఎన్నికలు ఒకేసారి పూర్తి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఒకేసారి ఎన్నికలన్నీ పూర్తిచేసుకుంటే తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్దిపైన దృష్టి సారించవచ్చని, ఇప్పటి నుంచే ఎన్నికలకు కూడా సన్నద్దమవుతామని...చెప్పారు. అయితే సిఎం చేసిన ఈ వ్యాఖ్యల్లో స్థానిక ఎన్నికల గురించా...లేక సార్వత్రిక ఎన్నికల గురించా అనే విషయం స్పష్టంగా చెప్పనప్పటికి..ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్దమవుతామనే వ్యాఖ్య ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలను సూచిస్తూనే అన్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

English summary
Sending feelers to partymen that the State may go in for early elections, Chief Minister Nara Chandrababu Naidu and senior minister Yanamala discussed with the party cadre in TDP coordination meeting on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X