• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు బాటలోనే జగన్‌- ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకుల హంగామా ఫలించేనా ?

|

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మూడోసారి ఏపీకి అగ్రస్ధానం దక్కింది. టీడీపీ హయాంలో రెండుసార్లు రాష్ట్రం ఇదే ఘనత సాధించినప్పుడు అదంతా బాబు మార్క్‌ హంగామాగా విమర్శించిన వైసీపీ ఇప్పుడు మాత్రం ఫస్ట్‌ ర్యాంకు తమ వల్లేనని చెప్పుకుంటోంది. 2019 ఏడాదికి ప్రకటించిన ర్యాంకుల్లో ప్రధమార్దంలో అధికారంలో ఉన్న టీడీపీ అదంతా ఐదేళ్ల తమ పాలన ఫలితమే అంటోంది. దీంతో అసలు ఈ ర్యాంకుల వెనుక ఏముంది ? మిగతా రాష్ట్రాలకు పట్టని ఈ ర్యాంకులపై ఏపీకి ఎందుకంత మోజు, అంతిమంగా చంద్రబాబు పాలనను విమర్శించిన వైసీపీ కూడా అదే బాటలో సాగుతోందా అన్న చర్చ సాగుతోంది.

  Ease Of Doing Business లో Andhra Pradesh స్థానం పై TDP వ్యాఖ్యలు || Oneindia Telugu
   ఈవోడీబీ ర్యాంకుల ప్రకటన డొల్లేనా ?

  ఈవోడీబీ ర్యాంకుల ప్రకటన డొల్లేనా ?

  మన దేశంలో అత్యంత వ్యాపార అనుకూల పరిస్ధితులు ఉన్న రాష్ట్రాలు ఏవని అడిగితే ఆర్ధిక రాజధాని మహారాష్ట్ర, ప్రతీ అంశంలో దీంతో పోటీపడే గుజరాత్‌ అనే విషయాన్ని ఎవరైనా చెబుతారు. వీటి తర్వాతే మిగతా రాష్ట్రాలవైపు పారిశ్రామికవేత్తల చూపు ఉంటుంది. దేశంలో టాప్‌ మిలియనీర్ల నుంచి విదేశీ పెట్టుబడిదారుల వరకూ ఈ రెండు రాష్ట్రాలపైనే దృష్టిపెడతారు. కానీ తాజాగా ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో ఆయా రాష్ట్రాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్య పోతారు. తాజా ర్యాంకుల్లో గుజరాత్‌ పదో స్ధానంలో ఉంటే మహారాష్ట్ర అసలు టాప్‌ 10లోనే చోటు దక్కించుకోలేకపోయింది. ఇక అనూహ్యంగా యూపీ పది స్ధానాలు మెరుగుపర్చుకుని రెండోస్ధానానికి చేరుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. ఇవన్నీ గమనిస్తే ర్యాంకుల వెనుక డొల్లతనం తెలుస్తోంది.

  ప్రచారం చేసుకున్నోళ్లకు చేసుకున్నంత...

  ప్రచారం చేసుకున్నోళ్లకు చేసుకున్నంత...

  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల ప్రకటనను గమనిస్తే తమ రాష్ట్రంలోకి వచ్చే వాస్తవ పెట్టుబడుల కంటే అవి వచ్చేస్తున్నాయని చేసుకునే ప్రచారమే కలిసొస్తున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో భారీగా పరిశ్రమలు వచ్చేస్తున్నాయని, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేస్తున్నాయని ఊదరగొట్టేవారు. కానీ వాస్తవానికి ఎక్కడో కియా వంటి ఒకటీ అరా పరిశ్రమలు మాత్రమే వచ్చాయి. కానీ ఈ ప్రచారం చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీకే పరిశ్రమలు ఎందుకు వెళ్లిపోతున్నాయన్న భ్రమ కలుగుతుంది. సరిగ్గా ఇదే అంశం ప్రామాణికంగా ర్యాంకులు లభిస్తున్నాయా అంటే అవుననే సమాధానం పారిశ్రామిక వర్గాల నుంచి సైతం వినిపిస్తోంది. ఇలాంటి ప్రచారాలు అవసరం లేని వాణిజ్య రాష్ట్రాలు గుజరాత్‌, మహారాష్ట్ర వెనుకబాటుకూ ఇదే కారణంగా తెలుస్తోంది.

  ర్యాంకులపై వైసీపీ పిల్లిమొగ్గలు..

  ర్యాంకులపై వైసీపీ పిల్లిమొగ్గలు..

  గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్ధానంలో నిలిచినప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీ ఇదంతా బాబు మార్క్‌ హంగామాగా విమర్శలు చేసేది. అంతెందుకు పెట్టుబడుల ఆకర్షణ కోసం చంద్రబాబు ఏటా వెళ్లే దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుపైనా విమర్శలు గుప్పించేది. పెట్టుబడులు అడుక్కోవడానికి టికెట్లు కొనుక్కొని వెళ్లాలా అంటూ వెక్కిరించేది. పెట్టుబడుల కోసం విశాఖలో నిర్వహించిన సదస్సులో లోటుపాట్లను గుర్తించి సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేసేది. తాము అధికారంలోకి వచ్చాక వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు ఆహ్వానం అందినా వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులు రాగానే ఇదంతా తమ వల్లే నంటూ ప్రచారం మొదలుపెట్టింది.

   బాబు బాటలోనే జగన్...

  బాబు బాటలోనే జగన్...

  గతంలో ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోని ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులను వైసీపీ సర్కారు తొలిసారిగా క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు విమర్శించిన ర్యాంకులను ఇప్పుడు తమవిగా చెప్పుకుంటోంది. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించినా ఇప్పటివరకూ చెప్పుకోదగిన పరిశ్రమలేవీ రాష్ట్రంలో ల్యాండ్‌ కాలేదు. వచ్చిన ఒకటీ అరా పరిశ్రమలు కూడా ఏపీతో కలిసి పనిచేస్తామంటున్నాయి తప్ప రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్దం కావడం లేదు. మరోవైపు కరోనా కారణంగా పెట్టుబడుల వాతావరణమే చెల్లాచెదురైంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకులు ఏపీ ప్రభుత్వానికి ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. ఈవోడీబీ ర్యాంకుల్లో అగ్రస్ధానంలో ఉందన్న కారణంతో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. కానీ దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు కూడా ఈ ర్యాంకుల డొల్లతనం తెలుసు కాబట్టి వీటిని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

  English summary
  ruling ysrcp government is claimed their efforts behind standing first in recently announced ease of doing business ranks. but ysrcp had opposed these ranks when they were in opposition earlier.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X