వోల్వో బస్సు ప్రమాదం: డ్రైవింగ్ నిర్లక్ష్యం, డివైడర్?
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనపై దర్యాఫ్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి గల కారణాలను ఫోరెన్సిక్ నిపుణులతో పాటు కర్ణాటకకు చెందిన మోటార్ వెహికిల్ జాయింట్ కమిషనర్, వోల్వో బస్సుకు సంబంధించిన నిపుణులచే దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం బస్సుకు సంబంధించిన దర్యాప్తును నెల రోజుల్లో పూర్తి చేయాలని ఇద్దరు ఐఎఎస్ అధికారులచే కమిటీని నియమించింది.
ఐఎఎస్ అధికారులైన రేమాండ్ పీటర్, ప్రేమ్‌చందర్ రెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. అలాగే సిఐడి అధికారులు కూడా ఈ దర్యాప్తుపై విచారణ కొనసాగించి ప్రయాణికుల వివరాలతో పాటు, బస్సులో తీసుకువస్తున్న వస్తువులపై ఆరా తీస్తున్నారు.

ప్రమాదానికి ప్రధాన కారణం డివైడర్‌పై ఉన్న రాడ్డు అని పలువురు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష డ్రైవింగ్ చేయడం డీజిల్ ట్యాంక్ పగలడానికి గల కారణమై ఉండోచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేసేందుకు వనపర్తి డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
అందుకుగాను ముగ్గురు సిఐలు బెంగుళూరుకు వెళ్లి వోల్వో బస్సు ఏజెన్సీపై విచారణ కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లో బస్సు కాలడం వల్ల అందులో ఉన్న వస్తువులపై అణువణువునా ఫోరెన్సిక్ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఉండాల్సిన సేఫ్టీ మెసర్స్ పూర్తిస్థాయిలో లేవని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications