సింహాచ‌లం స్వామివారికి రికార్డు స్థాయిలో ఆదాయం...

వైజాగ్‌లోని సింహాచలం అప్పన్న స్వామి ఆల‌యానికి రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరింది. 28 రోజులకు గాను భారీ ఆదాయం వ‌చ్చినట్లు ఆల‌య అధికారులు తెలిపారు. గత నెల 30వ తేదీన సింహాచలం అప్పన్న ఆలయంలో చివరిసారిగా హుండీ ఆదాయం లెక్కించడం జ‌రిగింది. అయితే మే నెల‌లో వేస‌వి సెల‌వులు, చందనోత్సవం, వైశాఖ పౌర్ణమి, గంధం అమావాస్య వంటి ఉత్సవాలు జ‌ర‌గుగా ఆల‌యానికి భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఈ ర‌ద్దీతో హుండీకి భారీగా ఆదాయం సమకూరిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. మంగళవారం ఆలయ పరకామణిలో ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో హుండీ ఆదాయం లెక్కింపు ప్ర‌క్రియ జ‌రిగింది. ఇందులో మొత్తం 28 రోజులకు గాను రూ.2,60,71,617 న‌గ‌దును భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు ఆల‌య ఈవో తెలిపారు.

న‌గ‌దుతో పాటు 116.200 గ్రాముల బంగారం, 20.540 కిలోల వెండి కూడా కానుక‌ల రూపంలో వ‌చ్చింది. అప్ప‌న్న‌స్వామి ఆల‌య హుండీల ద్వారా రోజువారీ సగటున ఆదాయం రూ.9,31,129 వచ్చింది. వీటితో పాటు విదేశీ క‌రెన్సీ కూడా వ‌చ్చింది. అప్పన్న హుండీలో కెన్యా కరెన్సీ 400 షిలాంగ్స్‌, యూఏఈకి చెందిన 330 దీరమ్స్‌, ఒమన్‌కు చెందిన 200 బైసాలు, మలేషియాకు చెందిన 123 రింగెట్స్‌, అమెరికాకు చెందిన 79 డాలర్లు, సౌదీ అరేబియాకు చెందిన 71 రియల్స్‌, ఇంగ్లాండుకు చెందిన 10 పౌండ్లు, కువైట్‌కు చెందిన 5 దీనార్లు, 2 సింగపూర్‌ డాలర్లు హుండీల ద్వారా సమకూరాయని ఆల‌య అధికారులు పేర్కొన్నారు.

Record income for Simhachalam Temple

ఈ ఆల‌య హుండీల లెక్కింపు కార్య‌క్ర‌మంలో దేవస్థానం ఏఈవోలు, పర్యవేక్షణాధికారులు, పలు సేవా సంస్థల కార్యకర్తలు పాల్గొన‌డం జ‌రిగింది. బుధవారం కూడా ఈ హుండీల ప్ర‌క్రియ కొనసాగనున్న‌ట్లు ఆల‌య ఈవో తెలిపారు. బుధవారం కూడా హుండీల లెక్కింపు పూర్తయితే, ప్రస్తుత ఆదాయానికి మరో రూ.50 లక్షలకుపైగా అదనంగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+