రికార్డు ధరకు సదావర్తి భూములు: దక్కించుకున్న కడపవాసి, పోటాపోటీగా వేలం..

Subscribe to Oneindia Telugu

చెన్నై: దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో.. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో సదావర్తి సత్రం భూముల వేలం ప్రక్రియ జరుగుతోంది. ఈ వేలం పాటలో రూ.60కోట్ల 30లక్షల రికార్డు స్థాయి ధరకు భూములు అమ్ముడుపోయాయి.

రికార్డు ధర:

రికార్డు ధర:

గతంతో పోల్చితే ఈ ధర దాదాపు రెట్టింపు ధర కావడం విశేషం. టోకెన్ నం.10, కడప జిల్లా వాసి అయిన సత్యనారాయణ ఇంత భారీ మొత్తానికి భూములను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ప్రక్రియ మొదలవగా.. గంట పాటు పోటాపోటీగా వేలం ప్రక్రియ సాగినట్లు సమాచారం.ఈ-టెండరు కమ్‌ సీల్డ్ కవర్‌ కమ్‌ బహిరంగ వేలం పద్ధతిన 83.11 ఎకరాల సత్రం భూముల అమ్మకానికై ఈ వేలం పాట నిర్వహించారు.

కారుచౌకగా కట్టబెట్టిందన్న ఆరోపణలు

కారుచౌకగా కట్టబెట్టిందన్న ఆరోపణలు


కాగా, గతంలో 83.11 ఎకరాల సదావర్తి భూములను రూ.22.40 కోట్లకే కారు చౌకగా ఏపీ ప్రభుత్వం విక్రయించిందన్న ఆరోపణలున్నాయి. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టుకెక్కడంతో.. కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. ప్రభుత్వం కట్టబెట్టిన రూ.22కోట్ల ధరకు మరో 5కోట్లు అదనంగా చెల్లిస్తే ఆ భూమిని మీరే సొంతం చేసుకోవచ్చంటూ ప్రకటించింది.

గతంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ 22 కోట్ల కు పొందగా ,ఈసారి భూములకు మూడు రెట్ల అధికర ధర పలకడం విశేషం.

టెండర్ల అర్హత పొందినవారు:

టెండర్ల అర్హత పొందినవారు:

కోర్టు సూచన మేరకు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఎమ్మెల్యే ఆర్కే ముందుకు రాగా.. ధరావత్తు చెల్లించిన అనంతరం.. బహిరంగ టెండర్ వేలం వేయాలని కోర్టు పేర్కొంది.-టెండర్లలో హరి అసోసియేట్‌ కంపెనీ అర్హత సాధించగా, బి. రామకృష్ణ, ఆళ్ల రామకృష్ణ, శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఆర్‌కే కిషోర్‌, డి.బ్రహ్మానందం, వెంకట జయరామిరెడ్డి టెండర్లు అర్హత పొందాయి.

తమిళనాడు అభ్యంతరం:

తమిళనాడు అభ్యంతరం:

ఇందులో భాగంగానే తాజాగా సదావర్తి భూములకు వేలం నిర్వహించగా.. రూ.60 కోట్ల 30 లక్షల రికార్డు ధర పలికినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఈ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సదావర్తి భూములు తమ రాష్ట్రానికి చెందిన ఆస్తులని, కాబట్టి ఏపీ ప్రభుత్వం నిర్వహించే వేలం ప్రక్రియను నిలుపుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంను కోరిన సంగతి తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Endowment wing conducted auction for Sadavarthy lands in Chennai.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి