రికార్డు ఉష్ణోగ్రతలు- ఎండల పై బిగ్ అప్డేట్, బీ అలర్ట్..!!
వేసవి ప్రారంభంలోనే ఎండలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా దేశంలోనే అత్యధికంగా నందిగామలో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. సాధారణం నుంచి రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకస్మికంగా వస్తున్న మార్పులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
రికార్డు స్థాయిలో
ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఏపీలోని నందిగామలో వరుసగా ఐదో రోజు దేశంలోనే అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గత వారం రోజులుగా ఎండ తీవ్రత కనిపిస్తున్నా.. రెండు రోజులుగా పెరిగిపోయింది.

అప్రమత్తం
గాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాష్ట్రంలో క్రమంగా తేమ శాతం తగ్గుతుందని చెప్పింది. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయని వెల్లడించింది. కాగా, ప్రస్తుత వేడి తీవ్రత మరో వారం రోజుల వరకు ఉండే అవకాశం ఉందని.. క్రమేణా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. వేకువ జామున కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. కానీ, 9 గంటల నుంచి పెరుగుతున్న ఎండ మధ్నాహ్నం సమయానికి గరిష్ఠానికి చేరుతోంది. దీంతో, పసి పిల్లలతో పాటుగా వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
నెలాఖరు నుంచి
తెలంగాణలో చాలా ప్రాంతాల్లో 32 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతా వరణ అధికారులు తెలిపారు. ఉదయం పూట 16 డిగ్రీల నుంచి 18, 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని పేర్కొన్నారు.హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి, మరో నాలుగైదు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. తర్వాత ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గి మళ్లీ ఫిబ్రవరి నెలాఖరులో పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి ఎండలు క్రమంగా పెరుగనున్నాయి.












Click it and Unblock the Notifications