చంద్రబాబు సొంత జిల్లాలో అల్లు అర్జున్ సినిమా రిపీట్, పక్కాప్లాన్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయని వెలుగు చూస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డుఅదుపు లేకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిని పలు సందర్బాల్లో హెచ్చరించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది. తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో వెల కట్టలేని ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. శేషాచలం అడువుల్లో ఎర్రచందనం చెట్లు నరకివేయడానికి పక్కాప్లాన్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడు నుండి కూలీలను తీసుకువచ్చి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు కొట్టేసి గుట్టుచప్పుడు కాకుండా వాటిని తరలిస్తున్నారు.

తిరుపతి శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం గురించే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తీశారు. పుష్ప సినిమాలో చూపించింది గోరంత అయితే రియల్ గా జరుగుతున్నది కొండంత అని స్థానికులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు పట్టుకుంటున్నారు. అయినా కూడా ఏమాత్రం భయం లేకుండా ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.

ఎర్రచందనం తరలిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఎక్కడ పోలీసులకు చిక్కిపోతామో అనే భయంతో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణం సమీపంలోని పలమనేరు- గుడియాతం రహదారిలో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొని కాలువలోకి పల్టీకొట్టింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ సంఘటన జరిగింది.

కాలువలోకి పల్టీ కొట్టిన కారు బయటకు తీయలేకపోవడంతో నిందితులు ఆ కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి పరిశీలించగా ఆ కారులో ఎర్రచందనం దుంగలు ఉన్నాయని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. క్రేన్ సహాయంతో కాలువలో పల్టీ కొట్టిన కారును బయటకు తీశారు. తమిళనాడు వైపు వేగంగా వెళుతున్న కారు కాలువలో పల్టీకొట్టిందని పోలీసులు అన్నారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications