ఎర్రచందనం స్మగ్లర్లు: పొరపాటున పోలీసులకే ఫోన్ చేసి దొరికిపోయారు
చిత్తూరు: ఓ ఎర్రచందనం స్మగ్లరు తన పొరపాటుతో పోలీసులకు దొరికిపోయాడు. ఒకరికి ఫోన్ చేయబోయి మరొకరికి ఫోన్ చేయడంతో అతని సంకెళ్లు పడ్డాయి. ఎర్రచందనం దుంగలను విక్రయించే క్రమంలో స్మగ్రల్లు చేసిన ఫోన్ కాల్ పోలీసులకు వెళ్లింది. దీంతో అసలుకే మోసం వచ్చింది.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం అగ్రహారం గ్రామంలో కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను దాచి ఉంచారు. ఓ ఇంట్లో దాచి ఉంచిన దుంగలను విక్రయించేందుకు ప్రయత్నించారు. తమ ప్రయత్నంలో భాగంగా కొంత మంది కొనుగోలుదార్లకు ఫోన్ చేశారు.

వీటిలో ఓ ఫోన్ కాల్ పొరపాటున పోలీసు అధికారులకు వెళ్లింది. దీంతో పోలీసులు పథకం ప్రకారం స్మగ్లర్లకు ఏ విధమైన అనుమానం రాకుండా అగ్రహారంపై దాడి చేశారు. అక్రమంగా దాచి ఉంచిన ఒక టన్ను బరువు గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications