టిడిపిలో అధిపత్యపోరు: చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర, అప్పలనాయుడుపై వేటు

Posted By:
Subscribe to Oneindia Telugu

చింతమనేని ప్రభాకర్ కు ప్రాణాపాయం తప్పింది. ఆయనను హత్యచేసేందుకు వ్యూహం రచించిన టిడిపి అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడుతో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు భార్య అనురాధను ఎంపిపి పదవి నుండి తొలగించేందుకు చింతమనేని ప్రభాకర్ ఒత్తిడి తెచ్చాడు. అంతేకాదు రాజకీయంగా అణచివేసేందుకుగాను ప్రయత్నిస్తుండడంతో చింతమనేనిని హత్యచేయాలని అప్పలనాయుడు భావించినట్టు పోలీసులు తెలిపారు.

Reddy Appalanaidu and other 8 members arrested for murder plan

చింతమనేనితో పాటు రౌడీషీటర్ జుజ్జవరపు జయరాజు, వ్యాపారి కోమర్తి మధును కూడ హతమార్చడానికి ఈ ముఠా కుట్ర పన్నిందని ఏలూరు డిఎస్పీ గోగుల వెంకటేశ్వర్ రావు చెప్పారు.ఈ కేసులో అప్పలనాయుడు, ఆర్. పురేందర్, షేక్ యాకూబ్, నక్కల పండు, షేక్ లతీఫ్, షేక్ నాగూర్, గున్నా బత్తుల సురేష్, భట్టిప్రోల్ హరీష్ కుమార్, రత్నకుమార్ లను అరెస్టు చేశారు.

నిందితుల నుండి హత్యకోసం సిద్దం చేసిన కత్తులను స్వాధీనం చేసుకొన్నారు. ఈ హత్యలు చేసేందుకు ముఠా సభ్యులకు రెడ్డి అప్పలనాయుడు పురంధర్ కు రనూ.90 వేలు అడ్వాన్సుగా ఇచ్చాడని పోలీసులకు సమాచారం. మొత్తం రూ.10 లక్షలను ఒప్పందంగా కుదుర్చుకొన్నారని పోలీసులు చెబుతున్నారు.నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా ఈ నెల 24వ, తేదివరకు రిమాండ్ ను విధించారు.

ఉద్దేశ్యపూర్వకంగానే కేసు

చింతమనేని ప్రభాకర్ ఉద్దేశ్యపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించారని రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. పోలీసులపై ఒత్తిడితెచ్చారన్నారు. తాను బయటకు వచ్చాక అన్ని విషయాలను వెల్లడిస్తానన్నారు. మరోవైపు రెడ్డిఅప్పలనాయుడు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Reddy Appalanaidu and other 8 members arrested for murder plan.Tdp spokesperson appalanaidu planned for murder . Eluru dsp arrested 8 nine members on Saturday.Reddy Appalanaidu removal from Tdp.
Please Wait while comments are loading...