236 ఓట్లతో కొమ్మూరిపై గెలుపు: పొన్నాలకు ఊరట

వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నుండి 2009 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ నుండి గెలుపొందిన పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక వివాదంపై హైకోర్టులో జూన్ 25 నాటికి వాదనలు పూర్తయ్యాయి. అప్పుడు కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
పొన్నాల లక్ష్మయ్య 2009లో కాంగ్రెసు పార్టీ తరఫున జనగామ నియోజకవర్గం నుండి నాటి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పైన 236 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే అంతకుముందే 44 ఓట్లతో కొమ్మూరి గెలిచినట్లు ప్రకటించిన అధికారి, ఆ తర్వాత పొన్నాల 236 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు.
దీనిపై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ కేసు విషయమై పొన్నాల పలుమార్లు కోర్టుకు హాజరయ్యారు. కొమ్మూరి పిటిషన్ పైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో హైకోర్టులో విచారణ జరిగింది. కొమ్మూరి తరఫు లాయర్ పొన్నాలను క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో జూన్ నెలలో రిజర్వ్ చేసిన కోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications