Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైర్టులో ఇవాళ పెద్ద ఊరట లభించింది. గత ప్రభుత్వంలో పవన్ పై నమోదైన ఓ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పవన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తన నిర్ణయం వెలువరించింది. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్ల ఫిర్యాదు మేరకు వైసీపీ ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది. దీనిపై హైకోర్టు ఇవాళ ఊరట కల్పించింది.

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారని, వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సేకరించిన డేటాయే ఇందుకు కారణమని పవన్ ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం వాలంటీర్లతో ఫిర్యాదులు చేయించింది. దీంతో వాలంటీర్ల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై గుంటూరు కోర్టులో విచారణ జరుగుతోంది.
దీంతో ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. గుంటూరు కోర్దులో విచారణపై స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై నమోదు చేసిన కేసును పోలీసులు కొనసాగిస్తేనే హైకోర్టు తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. కానీ గత ప్రభుత్వం ఈ మేరకు కేసుల నమోదుకు ఇచ్చిన జీవోను కూటమి సర్కార్ వెనక్కి తీసుకుంటుందని లాయర్లు కోర్టుకు తెలిపారు.












Click it and Unblock the Notifications