తిరుమలలో అన్యమతగ్రంథ కలకలం, ఉద్యోగి అరెస్ట్

టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయగా అన్యమత గ్రంథం వెలుగు చూసింది. అనంతపురం జిల్లా గోరంట మండలం ముత్తరాయ తండాకు చెందిన రంజిత్ నాయక్ గత పదిహేను రోజులుగా లడ్డూ ప్రసాద వితరణ కేంద్రంలో పని చేస్తున్నాడు. ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, మూడు రోజుల క్రితమే అన్యమత ప్రచారం చేస్తున్న ఓ వృద్ధురాలిని తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. అన్న ప్రసాద సముదాయం వద్ద ఆమెను మూడు రోజుల క్రితం గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో కాంట్రాక్టు వ్యక్తి పట్టబడటం గమనార్హం.












Click it and Unblock the Notifications