తిరుమల కొండపై శిలువ రచ్చ: మంత్రి వెల్లంపల్లి వర్సెస్ లోకేశ్: రాజీనామా సవాళ్లు..!

ఏపీ అసెంబ్లీలోనే కాదు..మండలిలోనూ అధికార..విపక్షాల మధ్య వాగ్వాదాలు..సవాళ్లు..ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. సమావేశాల చివరి రోజున శాసనమండలిలో తిరుమలలో అన్యమత ప్రచారం పైన మంత్రి వెల్లంపల్లి..మాజీ మంత్రి లోకేశ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తిరుమలలో అన్యమత ప్రచారం పైన మండలిలో టీడీపీ సభ్యులు ప్రస్తావించారు. ఈ వివాదం పైన అధికార..ప్రతిపక్ష పార్టీల సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో మంత్రి..మాజీ మంత్రి మధ్య సవాళ్ల పర్వం చోటు చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని డామేజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని మంత్రి వెల్లంపల్లి మండలిలో ఆరోపించారు.

తిరుమలలో అన్యమత ప్రచారం పైన..

తిరుమలలో అన్యమత ప్రచారం పైన..

టీటీడీలో అన్యమత ప్రచారంపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికార.. ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అన్యమత ప్రచారంలో లోకేష్‌ హస్తం ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సోషల్‌ మీడియా ద్వారా లోకేష్‌ అన్యమత ప్రచారం చేయిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని స్కెచ్‌ వేశారని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. దీని పైన గతంలోనే ప్రభుత్వం వివరణ ఇచ్చంది. అదే విధంగా టీటీడీ ఛైర్మన్ సైతం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. వన్య ప్రాణి సంరక్షణా కేంద్రానికి సంబంధించిన నిర్మాణం చూపించి దానిని అన్యమత ప్రచార కేంద్రంగా ప్రచారం చేసారని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. ఆ విధంగా తప్పుడు ప్రచారం చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని గతంలో స్పష్టం చేసారు. ఇప్పుడు తిరిగి ఇదే అంశం పైన శాసన మండలిలో రచ్చ చోటు చేసుకుంది.

సవాళ్లు..ప్రతి సవాళ్లు..

సవాళ్లు..ప్రతి సవాళ్లు..

మండలిలో రెండు పార్టీల నేతల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య సవాళ్లు..ప్రతి సవాళ్లకు కారణమైంది. తిరుమల కొండపై శిలువ ఉందని నిరూపిస్తే రాజీమా చేస్తానని వెల్లంపల్లి సవాల్ విసిరారు. శిలువ లేకపోతే లోకేష్‌ రాజీనామా చేస్తారా.. అని వెల్లంపల్లి అసెంబ్లీ వేదికగా సవాల్ చేశారు. దీనికి మండలిలోనే ఉన్న నారా లోకేష్ స్పందించారు. ఆరోపణలు రుజువు చేయకపోతే వెల్లంపల్లి రాజీనామా చేస్తారా అంటూ లోకేష్‌ ప్రతి సవాల్ విసిరారు. దీంతో...సభలో రెండు పార్టీల సభ్యుల నినాదాలతో హోరెత్తింది. ఛైర్మన్ రెండు పార్టీల సభ్యులను వారించారు.

శ్రీవారితో రాజకీయాలు చేయద్దు..

శ్రీవారితో రాజకీయాలు చేయద్దు..

మంత్రి వెల్లంపల్లి టీడీపీ ఆరోపణల మీద స్పందించారు. టీటీడీ మీద మచ్చ వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగవద్దని సూచించారు. అన్యమత ప్రచారం అంటూ చేస్తున్న దుష్ఫ్రచారం వెనుక లోకేశ్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా గ్రూపు ఉందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. టీటీడీ కొండపై శిలువ సోషల్‌ మీడియా క్రియేటివిటీ అని స్పష్టం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని టీడీపీ కుట్ర పన్నిందని.. టీటీడీలో అన్యమత ప్రచారం జరిగిందనేది అవాస్తవమని తేల్చిచెప్పారు. తిరుమల వెంకటేశ్వరస్వామితో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఇప్పటికే నాశనం అయ్యారని.. ఆలయాల జోలికి వస్తే ఇంకా నాశనం అవుతారని టీడీపీని ఉద్దేశించి వెల్లంపల్లి సీరియస్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+