విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో అద్దెలు ఎక్కువ, అదే అభివద్ధికి ఆటంకం: ఇదీ చంద్రబాబు మాట

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: బెజవాడలో అద్దెలు ఎక్కువని, నగరం అభివృద్ధి చెందకపోవడానికి అదే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌ హాస్పిటల్‌ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

విజయవాడ అభివృద్ధి చెందకపోవడానికి ఇళ్ల అద్దెలు ఎక్కువగా ఉండటమూ భూముల ధరలు అధికంగా ఉండటమే ప్రధాన కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ఇక్కడ నివసించేందుకు రావాలంటే అద్దెలను చూసి భయపడిపోతున్నారని చెప్పారు. ముంబై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల కన్నా విజయవాడలోనే అద్దెలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

Channdrababu Naidu

ఈ విషయంలో స్థానిక ప్రజలు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బయటి నుంచి వచ్చే వారికి అద్దెలు మరీ ఎక్కువగా చెప్పకుండా అందుబాటులో ఉండే విధంగా చెప్పాలని సూచించారు. కాస్మోపాలిటన్ కల్చర్ విజయవాడకు రావాలని చెప్పారు. అద్దెలు చూసి విజయవాడకు రావాలంటే భయపడుతున్నారని, హైదరాబాద్ కంటే ఎక్కువగా అద్దెలు ఉన్నాయంటున్నారని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌కు ధీటుగా ఆస్పత్రుల నిర్మాణాలు చేపడతామని ఆయన తెలిపారు. విజయవాడ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu said that due high rents Vijayawada is not developping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X