సాక్షి యాంక‌ర్ గా రేణు : ప‌వ‌న్ అదే ప్రాంతంలో : తెర మీద‌కు కొత్త రాజ‌కీయం..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌..రేణు దేశాయ్‌. ఇద్ద‌రూ తెలుగు వారికి బాగా తెలిసిన పేర్లు. వారిద్ద‌రూ వైవాహిక బంధం వారి వ్యక్త‌గ‌త కార‌ణాల వ‌ల‌న దూర‌మ‌య్యారు. కొద్ది కాలం క్రితం రేణు దేశాయ్ ను లక్ష్యంగా చేసుకొని కొన్ని విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. ఇప్పుడు ఇద్ద‌రూ దూరంగా ఉంటూ..ఎవ‌రి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అటువంటి ఇద్ద‌రూ ఒకే చోట కు వ‌స్తే..అదే ఇప్పుడు హాట్ టాపిక్..అందులోనూ రేణు దేశాయ్ సాక్షి యాంక‌ర్ గా సాక్షి లోగోతో రైతుల ముందు ద‌ర్శ‌న‌మిచ్చారు.అదే ఇప్పుడు కొత్త చ‌ర్చ‌..

క‌ర్నూలు జిల్లాలో రేణు దేశాయ్‌..
సినీ నటి రేణుదేశాయ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమె ఇప్ప‌టికే మంత్రాలయం చేరుకున్నారు. ఆత్మహత్య కు పాల్పడిన ఇద్దరు రైతుల కుటుంబాలను ఈరోజు రేణు ప‌రామ‌ర్శిస్తున్నారు.ఆత్మహత్యకు గల కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. గత ఏడాది ఆగస్టులో ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన రామయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత డిసెంబర్ లో పెదకడబూరుకు చెందిన రైతు పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు.

Renu Desai as Sakshi anchor : Pawan Kalyan in same district

ఈ రెండు గ్రామాల్లో నేడు ఆమె పర్యటించనున్నారు. రేణు దేశాయ్ పర్యటన సందర్భంగా ఆమెకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతు సమస్యల కథాంశంతో దర్శకురాలిగా ఓ చిత్రాన్ని ఆమె తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రేన్ ప్లే వర్క్ కూడా పూర్తయింది. దీంతో..స్వ యంగా రైతుల బాధలు తెలుసుకోవ‌టం కోసం రేణు దేశాయ్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. అయితే, ఈ కార్య‌క్ర‌మం లో రేణు దేశాయ్ సాక్షి లోగో ను ప‌ట్టుకొని రైతుల‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌టం స‌రి కొత్త ట్విస్ట్‌.

క‌ర్నూలు లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..
జనసే న అధినేత పవన్‌కల్యాణ్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. విద్యార్ధుల‌తో ప‌వ‌న్ ముఖాముఖి నిర్వ‌హిస్తున్నా రు. ఆదివారం క‌ర్నూలు బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ప‌వ‌న్ అటు ముఖ్య‌మంత్రి..ఇటు విప‌క్ష నేత ఇద్ద‌రి త‌ప్పుల‌ను ఎం డ‌గ‌ట్టారు. రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. మ‌ధ్నాహ్నం నుండి కోడుమూరు..ఎమ్మిగ‌నూరు లో ప‌వ‌న్ రోడ్ షోలో పా ల్గొంటారు. సాయంత్రం ఆదోని లో ప‌త్తి రైతుల‌తో ప‌వ‌న్ భేటీ అవుతారు.

Renu Desai as Sakshi anchor : Pawan Kalyan in same district

అనంత‌రం అదోని లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగిస్తారు. ఇద్ద‌రూ ఒకే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌క పోయినా..ఇకే జిల్లాలో ఉండ‌టం..అందునా రైతుల అంశం పైనే ఇద్ద‌రూ దృష్టి సారించ‌టం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, రేణు దేశాయ్ ప‌వ‌న్ క‌ర్నూలు వ‌చ్చే స‌మ‌యంలోనే..సాక్షి యాంక‌ర్ గా ఆ జిల్లాలోనే రైతుల మ‌ధ్య‌కు వెళ్ల‌టం.. రాజ‌కీయంగా కొత్త స‌మీక‌ర ణాల‌కు కార‌ణం అవుతుందా అనే చ‌ర్చ మొద‌లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+