తండ్రి శవం ముందే ఆశపడ్డాడు: జగన్‌పై రేణుక
హైదరాబాద్: తనను తెలంగాణ బిడ్డను కాదన్నవారు లోఫర్లని, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన తనను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలంగాణలో జీవించే హక్కు వారికి ఎంతో ఉందో తనకూ అంతే ఉందని, తనకు సర్టిఫికేట్ ఇచ్చే అర్హత ఆమె అన్నారు. ఇప్పుడు మీసాలు మెలేస్తున్నవారంతా సకలజనుల సమ్మె చేసినప్పుడు ఎక్కడ ఉన్నారని రేణుకాచౌదరి ప్రశ్నించారు.

సీమాంద్రులను రెచ్చగొట్టేవారికి తెలంగాణ రాష్ట్రం రావాలని లేదని రేణుకా చౌదరి విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిలో అన్ని ప్రాంతాలవారి కృషి ఉందని, విద్వేషంతో కూడిన విభజన అందరికీ నష్టమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
తండ్రి శవం ముందే ముఖ్యమంత్రి కావాలనుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదని రేణుకా చౌదరి ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications