ఏపీలో మొత్తం మారిపోయిన సీన్..గెలుపు ఆ పార్టీదే తేల్చిసిన సర్వే

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీని ఓడించడానికి రాజకీయ పార్టీలన్నీ ఏకం అయిన పరిస్థితి. జగన్ ప్రత్యర్థులందరూ చేతులు కలుపుతున్న వైనం ఏపీ ముఖచిత్రంలో కనిపిస్తోంది. జగన్‌ను ఢీ కొట్టడానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు జత కట్టాయి. మూడు పార్టీలు జగన్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. మరోవైపు ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ వేదికగా సీఎం జగన్‌పై రాయి దాడి జరగడంతో రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. జగన్‌కు వస్తోన్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ వారే ఇలా దాడులు చేయించుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు.

renuka pothineni survey on ap assembly elections 2024

ఇదిలా ఉంటే సర్వేలు మొత్తం కూడా వైసీపీదే అధికారమని తేల్చి చెబుతున్నాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకే పట్టం కడుతున్నాయి. 15 సర్వేల ఫలితాలు విడుదలైతే 12 సర్వేలు వైసీపీదే మళ్లీ అధికారమని తేల్చి చెబుతున్నాయి. ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ , సీ - ఓటర్ సర్వేలను మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి. తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించిన మరో సర్వే బయటకు వచ్చింది. ప్రముఖ జర్నలిస్ట్ రేణుక పోతినేని తమ సర్వే నివేదికను వెల్లడించారు.

జర్నలిస్ట్ రేణుక పోతినేని చేసిన సర్వేలో వైసీపీ 134 సీట్లు గెల్చుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని ఆమె తెలిపారు. కూటమి 41 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. వైసీపీకి 52 శాతం ఓటు బ్యాంక్‌తో 134 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని జర్నలిస్ట్ రేణుక పోతినేని సర్వే చెబుతోంది. మహిళలు 58 శాతం , పురుషులు 42 శాతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆ సర్వే ద్వారా తేలింది.కూటమికి 45 సీట్లు కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చిసింది. అయితే ఈ సర్వేను టీడీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఇది వైసీపీ అనూకుల సర్వే అంటూ కూటమి నేతలు పెదవి విరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+