షాక్: నాకు మంత్రే బోర్డింగ్ పాస్ ఇప్పించారు, ఆశోక్ ను ఇరికించిన జెసి దివాకర్ రెడ్డి
విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి గొడవ వ్యవహరంలో కేంద్ర పౌరవిమానాయానశాఖమంత్రి ఆశోక్ గజపతిరాజు దొరికిపోయారు. ఈ వివాదం కేంద్రమంత్రి ఆశోక్ మెడకకు
అమరావతి: విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి గొడవ వ్యవహరంలో కేంద్ర పౌరవిమానాయానశాఖమంత్రి ఆశోక్ గజపతిరాజు దొరికిపోయారు. ఈ వివాదం కేంద్రమంత్రి ఆశోక్ మెడకకు చుట్టుకొనేలా కన్పిస్తోంది.ఈ మేరకు ఓ జాతీయ మీడియా చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో మంత్రి ఆశోక్ గజపతిరాజు పేరును జెసి దివాకర్ రెడ్డి బయటపెట్టారు.
విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి గొడవ జరిగిన సమయంలో పౌరవిమానశాఖ మంత్రి ఆశోక్ గజపతిరాజు దొరికిపోయారు. గొడవ జరిగిన సమయంలో మంత్రి ఆశోక్ గజపతి రాజు అక్కడే ఉన్నాడని తేలింది.

జెసి దివాకర్ రెడ్డి ఎయిర్ పోర్ట్ లో గొడవ పెట్టుకొన్న సమయంలో మంత్రి ఆశోక్ గజపతిరాజు విమానాశ్రయంలోనే ఉన్నారని, ఆయనే మేనేజర్ ను పిలిచి తనకు బోర్డింగ్ పాస్ ఇప్పించారని స్టింగ్ ఆపరేషన్ లో దివాకర్ రెడ్డి ప్రకటించారు.
ఆయన స్టేషన్ మేనేజర్ ను పిలిచారు. రెడ్డి ఏది అడుగుతున్నారో అది ఇవ్వండని మంత్రి ఆదేశించినట్టు చెప్పారు. ఆ రోజు అదే విమానంలో విశాఖ నుండి హైద్రాబాద్ కు వచ్చానని ఆయన చెప్పారు. దివాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఆశోక్ గజపతిరాజు ఇరకాటంలో పడ్డారు. జెసి గొడవతో తనకు సంబంధం లేదని మంత్రి గతంలోనే ప్రకటించారు.
అయితే ఈ ఘటనపై ఆశోక్ గజపతిరాజు విచారణకు ఆదేశించడంపై జెసిని ప్రశ్నిస్తే ఆయన రాజకీయనాయకుడు కాదు. ఆయన అధికారి, ఆయన రాజకీయనేతగా పనిచేయడం లేదు. అధికారిలా పనిచేస్తున్నారని సమాధానమిచ్చారు.
ఇండిగో ఎయిర్ లైన్స్ పై దౌర్జన్యం చేసిన మాట వాస్తవమేనని దివాకర్ రెడ్డి ఒప్పుకొన్నారు. నేను హడావుడిలో ఉన్నాను. రెండు మూడు సార్లు బతిమాలినా నాకు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో బావోద్వేగానికి గురయ్యాను. అక్కడున్న ప్రింటర్ ను పక్కకు తోసేయ్యాలనుకొన్నాను.
కానీ, నావల్ల కాలేదు. నేను ఎవరికీ క్షమాపణ చెప్పను. నేనేందుకు క్షమాపణ చెప్పాలి. నేను మనిషినే. ప్రయాణం హడావుడిలో ఈ ఘటన చోటుచేసుకొందని జెసి పేర్కొన్నారు. కాగా, ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ ను వెనుక నుండి జెసి నెట్టేస్తున్న దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఫ్రెండ్లీగానే ఆయన భుజాలపై చేతులు వేశానన్నారు. కానీ, ఆయనను నెట్టివేయలేదని ఆయన తన వాదనను ఆయన సమర్థించుకొన్నారు.
ఈ నెల 15న విశాఖపట్టణంలో ఎయిర్ పోర్ట్ లో దివాకర్ రెడ్డి వీరంగం సృష్టించారు. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతోనే ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై జులుం ప్రదర్శించారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఎయిరిండియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ సహ పలు సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి.












Click it and Unblock the Notifications