AP Volunteers: వాలంటీర్ల కీలక నిర్ణయం ! వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు ?

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో పార్టీ రంగు పులుముకున్న వాలంటీర్లపై చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10 వేల రూపాయల పారితోషికం ఇచ్చి వారిని కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. అదే సమయంలో గతంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో వారికి మంత్రులు కీలక సూచన చేశారు.

వైసీపీ హయాంలో వారి ఒత్తిళ్లలో రాజీనామాలు చేసి పార్టీ ప్రచారంలో పాల్గొన్న వీరిని తమతో అప్పట్లో రాజీనామాలు చేయించిన వారిపై కేసులు పెట్టి రావాలని టీడీపీ మంత్రులు తాజాగా సూచిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇలా గతంలో రాజీనామాలు చేసిన దాదాపు లక్ష మంది వాలంటీర్లు ఇప్పుడు అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ నెల్లూరు జిల్లాలో గతంలో రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొన్న వారంటీర్లు.. అప్పుడు తమను విధుల నుంచి తప్పుకోవాలని ఒత్తిడి నేతల నేతలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

resigned volunteers follow tdp s advice filed complaints against ysrcp leaders

గతంలో వైసీపీ కార్పోరేటర్లు, నేతల ఒత్తిడితోనే తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందని, అలా తమపై ఒత్తిడి తెచ్చి విధుల నుంచి తప్పుకునేలా చేశారంటూ ఇప్పుడు సదరు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఇవాళ ఈ మేరకు రాజీనామాలు చేసిన వాలంటీర్ల నుంచి వైసీపీ నేతలపై ఫిర్యాదులు అందుతున్నాయి.తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై వీరు ఫిర్యాదులు చేస్తున్నారు.

నగరంలోని అనేక పీఎస్ లలో వీరు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు కొందరు వాలంటీర్లు కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 41 వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, మధుసూదన్ రావు తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వేదాయపాలెం, దర్గామిట్ట పోలీస్ స్టేషన్లకు భారీగా వస్తున్న వాలంటీర్లు.. తమను ఒత్తిడ్లకి గురి చేసి రాజీనామా చేపించి తమ జీవితాలతో ఆడుకున్నారని వాపోతున్నారు. కాసేపటి క్రితం దర్గామిట్ట పీఎస్ లో 35 వ డివిజన్ కార్పొరేటర్ పై వాలంటీర్లు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+