హైదరాబాద్‌పై ఆంక్షలు సహించం: కెసిఆర్, షబ్బీర్ ఫైర్
కరీంనగర్/ వరంగల్: హైదరాబాద్‌పై ఏ విధమైన ఆకంక్షలను కూడా తాము అంగీకరించబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు తమ తెలంగాణ రాష్ట్రానికే ఎందుకని ఆయన అడిగారు. శాంతిభద్రతలను కేంద్ర ఆధీనంలో ఉంచుకోవాలనే ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. పార్టీ కార్యకర్తల వివాహాలకు హాజరైన ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై ఆంక్షలు పెడితే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే మరో యుద్ధం తప్పదని ఆయన అన్నారు.

తెలంగాణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే బెబ్బులిలా పంజా విసురుతామని ఆయన చెప్పారు. శాంతిభద్రతలను కాపాడుకోవడం తమకు తెలియదా అని ఆయన అడిగారు. మణుగూరు థర్మల్ పవర్ ప్లాంట్‌ను విజయవాడకు తరలించి అన్యాయం చేశారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు సౌమ్యులు, తెలంగాణ వస్తుందని సంయమనం పాటిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి మూర్ఖుడని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో దోపిడీని కొనసాగించేందుకే ముఖ్యమంత్రి సమైక్యం ముసుగు ధరించారని ఆయన వ్యాఖ్యానించారు.
తెరాసపై త్వరలో స్పందిస్తాం
రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రకటనలపై తాము త్వరలో స్పందిస్తామని తెలంగాణకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెసు తెలంగాణ జైత్రయాత్రలో పాల్గొనడానికి వచ్చిన షబ్బీర్ అలీ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక మాటలు ఇంకా కొద్ది రోజులు మాత్రమేనని ఆయన అన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయానికి ఎవరూ అతీతులు కారని ఆయన అన్నారు. డిసెంబర్‌లోగా తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications