రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం, ఇరకాటంలో టీడీపీ: బాబుపై జగన్‌కు ఛాన్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చిక్కుల్లోకి నెట్టారా? ఏపీలో ప్రతిపక్ష వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించారా? అంటే అవుననే అంటున్నారు.

రేవంత్ రెడ్డి ఔట్: ఇంకా టీడీపీకి కేసీఆర్ జీవం పోస్తారా??

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందున

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందున

రేవంత్ రెడ్డి శనివారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. అదే సమయంలో కొడంగల్ ఎమ్మెల్యేగా కూడా రాజీనామా పత్రాన్ని అందించారు. రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నైతికంగా ముందుకు వెళ్లేందుకు రాజీనామా ఇచ్చారు.

ఎందుకు రాజీనామా చేశారు

ఎందుకు రాజీనామా చేశారు

గతంలో తెలంగాణ టీడీపీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర రావు వంటి నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు. వారు పార్టీ మారినప్పుడు ప్రశ్నించిన రేవంత్.. తాను పార్టీ మారుతున్న సమయంలో తనను ప్రశ్నించకుండా ఉండేందుకు ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.

రేవంత్ సరే.. చంద్రబాబును ఇరకాటంలో పెట్టారు

రేవంత్ సరే.. చంద్రబాబును ఇరకాటంలో పెట్టారు

రేవంత్ రెడ్డి రాజీనామా స్పీకర్ వద్దకు చేరిందా? స్పీకర్ వద్దకు చేరినా ఆయన ఆమోదిస్తారా? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆయన రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ఇదిలా ఉంటే, రేవంత్ తన రాజీనామాతో ఏపీలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టారని అంటున్నారు.

వైసిపి నుంచి టీడీపీలోకి ప్రజాప్రతినిధులు

వైసిపి నుంచి టీడీపీలోకి ప్రజాప్రతినిధులు

2014లో వైసీపీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అందులో అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు మంత్రులు కూడా అయ్యారు. కానీ వారు రాజీనామా చేయలేదు.

ఎప్పటి నుంచో వైసీపీ డిమాండ్

ఎప్పటి నుంచో వైసీపీ డిమాండ్


పార్టీ మారిన వారు రాజీనామా చేయాలని, మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనిపై వైసీపీకి టీడీపీ సమాధానం చెబుతోంది. తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని, కానీ నంద్యాల ఫలితమే వస్తుందని చెబుతోంది. కానీ రాజీనామాలు మాత్రం చేయడం లేదు.

వైసీపీ గొంతు పెంచేందుకు ఆస్కారం

వైసీపీ గొంతు పెంచేందుకు ఆస్కారం

గతంలో తెలంగాణలో టీడీపీ నుంచి మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ పోరు సాగించారు. ఇప్పుడు స్వయంగా ఆయన పార్టీ మారుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నిన్నటి వరకు రేవంత్ తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పోరాడినప్పుడు వైసిపి.. చంద్రబాబును నిలదీసింది. అక్కడ అలా, ఇక్కడ ఇలానా ఉంటారా అని. ఇప్పుడు రేవంత్ స్వయంగా రాజీనామా చేసి వైసిపి, జగన్.. చంద్రబాబుపై మరింత గొంతు పెంచేందుకు ఆస్కారం లభించిందని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana leader Revanth Reddy gave chance to YSR Congess Party chief YS Jaganmohan Reddy on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి