బెయిల్‌పై రేవంత్‌కు షాక్, ఖైదీ నెం.1779: అడ్డంగా దొరికారిలా (వీడియో)
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో రూ.5 కోట్ల డీల్‌కు గాను, రూ.50 లక్షల మొత్తం ఆదివారం ఇవ్వజూపిన కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో నలుగురి పేర్లను పేర్కొన్నారు.
ఏ1గా రేవంత్ రెడ్డి, ఏ2గా సెబాస్టియన్, ఏ3గా ఉదయ్ సిన్హా, ఏ4గా మాథ్యూస్ జెరూసలేంను పేర్కొన్నారు. కాగా, రేవంత్ రెడ్డికి ఆదివారం అర్ధరాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట రేవంత్‌ను హాజరుపరిచారు. రేవంత్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండు విధించింది. అతనిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
చంచల్ గూడ జైలులో రేవంత్ ఖైదీ నెంబర్ 1779
చంచల్ గూడ జైలులో రేవంత్ రెడ్డికి నెంబర్ 1779ను కేటాయించారు. తనకు ప్రాణభయం ఉందని రేవంత్ జడ్జికి విన్నవించారు. దీంతో హైసెక్యూరిటీ బ్యారక్‌లో అతనిని ఉంచారు. జైలు వద్ద పటిష్ట బంధోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ అధికారులు కోర్టులో రిక్విజేషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రత్యేక సదుపాయాలు
రేవంత్ రెడ్డికి బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు అతనిని తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు. మరోవైపు, తనకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని రేవంత్ మరో పిటిషన్ దాఖలు చేశారు.
రేవంత్‌కు షాక్
రేవంత్ రెడ్డి బెయిల్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఏసీబీ కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరింది. దీంతో న్యాయస్థానం అంగీకరించింది. రేవంత్ తరఫు న్యాయవాదుల ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించారు. ప్రత్యేక వసతుల పిటిషన్ కూడా రేపు విచారించనున్నారు.

రేవంత్ రెడ్డి
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయల లంచం ఇవ్వజూపిన కేసులో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలు వద్ద ఆందోళన

రేవంత్ రెడ్డి
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయల లంచం ఇవ్వజూపిన కేసులో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.

రేవంత్ రెడ్డి
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయల లంచం ఇవ్వజూపిన కేసులో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలు వద్ద భారీ భద్రత

రేవంత్ రెడ్డి
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయల లంచం ఇవ్వజూపిన కేసులో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. రేవంత్‌న తరలిస్తున్న దృశ్యం.
రేవంత్ రెడ్డి ఓటు వేస్తారా?
రేవంత్ అరెస్టు నేపథ్యంలో సోమవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓటు వేయనిస్తారా లేదా అన్నది తెలంగాణ టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అరెస్టు తర్వాత ఎమ్మెల్యేను రిమాండుకు పంపుతారు. నిబంధనల ప్రకారం సోమవారం ఉదయం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించాల్సి ఉంటుంది.
రిమాండులో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఓటు వేయడానికి అనుమతి ఉంటుందని న్యాయనిపుణులు అంటున్నారు. వైసీపీ అధ్యక్షులు జగన్ గతంలో జైలులో రిమాండులో ఉన్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలీసులు ఆయనను తీసుకు వచ్చి ఓటు వేయించారు. దీనిపై టీడీపీ వర్గాలు కూడా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.య అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాయి. మరోవైపు, ఏసీబీ కస్టడీలో ఉంటే మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదని ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు.
ఓటు వేసేందుకు అనుమతి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసేందుకు అనుమతివ్వాలని రేవంత్ రెడ్డి జడ్జిని కోరారు. పిటిషన్ దాఖలు చేసుకోవాలని జడ్జి సూచించారు. అనంతరం అతనికి ఓటు వేసేందుకు అనుమతించారు. రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి తీసుకు రానున్నారు. ఆయన ఓటు వేసిన అనంతరం చర్లపల్లి జైలుకు తరలిస్తారు.
ఈసీకి లేఖ
ఎన్నికల సంఘానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications