చంద్రబాబూ! అంబానీతో ఏం మాట్లాడారో చెప్పండి: వైసిపి

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి భేటీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రయోజనాలను, విలువైన వనరులను చంద్రబాబు ముకేష్ అంబానీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపించింది.

  Mukesh Ambani Plans To Build Electronic Park In Tirupati

  మాజీ శాసనసభ్యుడు, గుంటూరు వైసిపి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు రావి వెంకట రమణ బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. అంబానీతో ఏం మాట్లాడారో వెల్లడించాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.

  చంద్రబాబు ఇలా చేశారు

  చంద్రబాబు ఇలా చేశారు

  గత తొమ్మిదేళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో చంద్రబాబు ప్రభుత్వ సంస్థలను చంద్రబాబు బలహీనపరిచారని, సహకార రంగంలోని పంచదార మిల్లులను మూసేశారని ఆయన ఆరోపించారు.

  రిలియన్స్ చేతికి విలేజ్ మాల్స్

  రిలియన్స్ చేతికి విలేజ్ మాల్స్

  రిలయన్స్ భాగస్వామ్యంతో విలేజీ మాల్స్ తెరిచి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను రిలయన్స్ చేతుల్లో పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ప్రభత్వ పాఠశాలలను, ఆస్పత్రులను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చూస్తున్నారని ఆయన అన్నారు.

  దోచుకోవడానికి ఇరువురి ప్లాన్

  దోచుకోవడానికి ఇరువురి ప్లాన్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విలువైన ఖనిజ సందను, ఇతరాలను దోచుకోవడానికి ముకేష్ అంబానీ, చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో వైసిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్దర్శి ఆంజనేయులు తదితురలు పాల్గొన్నారు.

  రిలయన్స్ ఏనాడు కూడా

  రిలయన్స్ ఏనాడు కూడా

  టాటా, బిర్లా కంపెనీలు చారిటబుల్ ట్రస్టుల ద్వారా సామాజానికి సేవ చేస్తున్నాయని, రిలయన్స్ ఏ రోజు కూడా అటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని రావి వెంకట రమణ అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress leaders alleged that Chief Minister N. Chandrababu Naidu was mortgaging the interests and wealthy resources of the state to Reliance Industries Limited chairman Mukesh Ambani.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి