గెలుపెవరిది: సూర్యాపేటలో ఇండిపెండెంట్‌తో ముచ్చెమట

రాంరెడ్డి దామోదర్ రెడ్డి గత ఎన్నికల్లో సూర్యాపేట నుండి పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేసి తనదైన ముద్రవేసుకున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలు తనకు కలిసి వస్తాయని ఆయన ధీమాగా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. 1983 నుండి 1994 వరుసకు టిడిపి వరుసగా ఇక్కడ జెండా ఎగురువేసింది. ఆ తర్వాత నుండి కాంగ్రెసు పార్టీ గెలుస్తోంది. గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తెరాసకు కేటాయించగా ఓటమి పాలైంది. టిడిపి అభ్యర్ధి రమేష్ రెడ్డి చాలా రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బలమైన కేడర్, బాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం తనకు కలిసి వస్తుందని చెబుతున్నారు.
తెరాస తరఫున గుంతకండ్ల జగదీశ్ రెడ్డి పోటీలో ఉన్నారు. తెరాస వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారని, అది తనకు విజయం సాధించి పెడుతుందని భావిస్తున్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు బిజెపిలో చేరి టిక్కెట్ కోసం తీవ్రంగా యత్నించారు. టిడిపి, బిజెపి పొత్తుల్లో భాగంగా ఈ స్థానం టిడిపికి కేటాయించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయనకు సిపిఎం మద్దతిస్తోంది.












Click it and Unblock the Notifications