నమ్మినవారిని ముంచడం కెసిఆర్ నైజం: రేవూరి

సెంటిమెంటు అస్త్రంగా తమ పార్టీని దెబ్బతీయడానికే కాంగ్రెస్ పార్టీతో తెరాస కుమ్మక్కవుతోందని ఆయన ఆరోపించారు. మాటల గారడీతో కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. తెరాస దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
తెరాస ఆవిర్భావం రోజున ఉన్నవారిలో ఎంతమంది ఇప్పుడు కెసిఆర్ పక్కన ఉన్నారని ప్రశ్నించారు. కెసిఆర్ వైఖరి నచ్చక పోవడం వల్లే నిఖార్సైన తెలంగాణ వాదులు ఎందరో ఆయను వీడారని రేవూరి గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ తీయాలని కెసిఆర్ చూస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ ఎదుగుదలకు దోహదపడిన టిడిపిని దెబ్బ తీయాలని కెసిఆర్ అనుకోవడం ద్రోహమేనని ఆయన అన్నారు
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు కుటుంబసభ్యులను తీసుకెళ్లిన కెసిఆర్‌కు నాయని, ఈటెల, కోదండరామ్ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు నష్టం చేకూర్చే ఎన్నో అంశాలు బిల్లులో ఉన్నా నోరుతెరవని కెసిఆర్ పునర్‌నిర్మాణం అనడంలో అర్థం లేదని రేవూరి అన్నారు.












Click it and Unblock the Notifications