కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ - కీలక చర్చలు : ప్రకటన దిశగా..!!

తెలంగాణలో రాజకీయాలపైన చంద్రబాబు ఆలోచన మారుతోంది. పూర్తిగా ఏపీ రాజకీయాల పైనే దృష్టి పెడుతున్న చంద్రబాబు, ఇప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు కలిసిన సమయంలో పార్టీ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఇక తెలంగాణ పార్టీ వ్యవహారాలపైన ఫోకస్ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక నుంచి తాను తరచుగా ఎన్టీఆర్‌ భవన్‌కు వస్తానని పార్టీ నేతలకు స్పష్టం చేసారు. తెలంగాణలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యాచరణ ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారు.

చంద్రబాబు టార్గెట్ ఏపీ వయా తెలంగాణ

చంద్రబాబు టార్గెట్ ఏపీ వయా తెలంగాణ

ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక గురించి చర్చకు వచ్చింది. స్థానికంగా ఉన్న టీడీపీ శ్రేణులతో చర్చించాలని చంద్రబాబు సూచించారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటంతో..వెంటనే స్థానికంగా ఉన్న నేతలతో చర్చించి అభిప్రాయాలు చెప్పాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. మూడు ప్రధాన పార్టీలు కూడా అగ్రవర్ణాలకే టిక్కెట్లు ఇచ్చాయని తెలంగాణ పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ తీసుకున్న నిర్ణయం ..క్షేత్ర స్థాయిలో వస్తున్న ఫీడ్ బ్యాక్ పైన ప్రధానంగా చర్చ జరిగింది. మునుగోడుకు చెందిన టీడీపీ నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. మునుగోడులో టీడీపీకి బీసీ కేడర్ ఉందని..ఎవరిని ఎంపిక చేసినా తామంతా కలిసి పని చేస్తామని నియోజకవర్గ నేతలు చంద్రబాబుకు వివరించారు. దీని పైన తాను ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పార్టీ బలోపేతం పైన చర్చలు

పార్టీ బలోపేతం పైన చర్చలు

అయితే, ఇప్పుడు బీజేపీ వర్సస్ కేసీఆర్ గా మారిన తెలంగాణ రాజకీయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో తమను రాజకీయంగా దెబ్బ తీసిన కేసీఆర్ లక్ష్యంగా పావులు కదిపేందుకు సిద్దమవుతున్నారు. పార్టీ తెలంగాణలో బలహీనపడినా..ప్రస్తుతం నెలకొన్న పోటీ పోటీ రాజకీయంలో ప్రతీ నియోజకవర్గం కీలకంగా మారుతోంది. అందునా సామాజిక సమీకరణాలు ప్రభావితం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న బీజేపీతో టీడీపీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకొనే అవకాశాలు లేవు. కానీ, ఏపీలో అధికారంలోకి రావటం చంద్రబాబుకు కీలకం కావటంతో..అక్కడ మేలు జరిగే విధంగా తెలంగాణలో రాజీకయం చేయటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందుకు మునుగోడు నుంచే అడుగులు వేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఏ స్థాయిలో ఓట్లు పడే అవకాశం ఉందనే కోణంలో ఆరా తీసినట్లుగా సమాచారం.

మునుగోడు నుంచి తొలి అడుగు

మునుగోడు నుంచి తొలి అడుగు

మునుగోడు ఉప ఎన్నిక పైన చంద్రబాబు పార్టీ భునవగిరి పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి కృష్ణమాచారి నుంచి వివరాలు సేకరించారు. ఏపీలో 2014 ఎన్నికల తరహాలో పొత్తుతో ముందుకు వెళ్లాలని...వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలనేది చంద్రబాబు వ్యూహం. అయితే, బీజేపీ నుంచి స్పష్టత రావటం లేదు. కానీ, రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ద్వారా చంద్రబాబే ఒక అడుగు ముందుకు వేసారు. ఇప్పుడు మనుగోడులోనూ మరో అడుగు వేసి..అటు కేసీఆర్ ను దెబ్బ తీయటం..ఇటు బీజేపీతో భవిష్యత్ సంబంధాల కోసం ప్రణాళికలు సిద్దం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీతో ఏపీలో పొత్తు లేకపోయినా.. జగన్ తో దూరం చేయగలిగితే ఎన్నికల వేళ..వ్యూహాత్మకంగా పైచేయి సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఏపీలో ఎటువంటి రాజకీయం చేయబోతున్నారనే కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి. దీంతో..బీజేపీకి ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ అవుతున్న వేళ..చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+