Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కంచుకోటలకు తూట్లు: 100% స్ట్రైక్ రేట్ దేవుడెరుగు: సర్వే షాక్

Chandrababu and Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. వార్షికోత్సవ వేడుకలకు సమాయాత్తమౌతోంది.

గత ఏడాది జూన్ 12వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇతర మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

RISE survey on Godavari districts in AP predicts 19 MLA facing anti incumbency

టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుంది. ఏపీకి చెందిన ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ రంగంలోకి దిగింది. తన తాజా నివేదికను రూపొందించింది. మొన్నటి వరకు విజయనగరం, కాకినాడ, తిరుపతి లోక్ సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించిన ఈ సంస్థ.. తాజాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి సారించింది.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై అంచనాలను రూపొందించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, పరిపాలన విధానం, తీరుతెన్నులనూ తన సర్వే కోసం ప్రాతిపదికగా చేసుకుంది.

షాకింగ్ వివరాలను వెల్లడించింది రైజ్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తోన్నాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు చెందిన 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలపై జనసేన పూర్తిగా పట్టు కోల్పోతోందని పేర్కొంది.

మెజారిటీ శాసన సభ్యులు ఇక్కడ వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయని రైజ్ అభిప్రాయపడింది. దీనికి గల కారణాలను కూడా రైజ్ సంస్థ విశ్లేషించింది. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జీలదే ఇక్కడ పెత్తనం నడుస్తోందని కుండబద్దలు కొట్టింది.

ఇసుక దందా, ఇసుక అక్రమ తవ్వకాలు, కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన కరెంట్ బిల్లులు.. వంటి అంశాలు వ్యతిరేకతకు కారణమైనట్లు పేర్కొంది. వీటితో పాటు- సంక్షేమ పథకాల అమలు కాకపోవడం, పంట ఉత్పత్తుల కొనుగోలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటివి ఉన్నాయని తెలిపింది.

ఆక్వా రంగం ఎదుర్కొంటోన్న ఇబ్బందులు సైతం ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీయడానికి దారి తీస్తోన్నాయని పేర్కొంది. కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తల్లో గుంభనంగా అసంతృప్తి నెలకొని ఉందని, ఎమ్మెల్యేలపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు..ఇక్కడ ప్రభావితం చేస్తున్న అంశాలని వివరించింది. రేషన్ సరఫరాపై కూడా వ్యతిరేకత మొదలైందని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+