ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తాజా సర్వే-డేంజర్ లో వీరే..! వీరికి నో ఛాన్స్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ వరుస సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఏడాది పాలన తర్వాత ఎమ్మెల్యేలపై వారి నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో వెల్లడిస్తూ పలు సర్వేలు వెలువడుతున్నాయి. ఇందులో కేకే సర్వేతో పాటు రైజ్ సర్వే కూడా ఉంది. ఇందులో రైజ్ సర్వే ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలు ప్రకటిస్తోంది. ఇందులో ఇావాళ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేల పరిస్ధితిపై ఫలితాలు వెల్లడించింది.

ఇందులో కూటమి ఏడాది పాలన సందర్భంగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రైజ్ సర్వే చేసినట్లు సర్వేయర్ ప్రవీణ్ పుల్లట తెలిపారు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కూటమి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలకు 2029లో నో ఛాన్స్ అని తేల్చిచెప్పేశారు. 14 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు. ఎమ్మెల్యేల్లో మితిమీరిన సంపాదన పిచ్చి ఇందుకు కారణమని తెలిపారు. ఎన్నికల ఖర్చులు రాబట్టుకోవాలనే యావతో టార్గెట్లు ఫిక్స్ చేశారని వెల్లడించారు.

RISE survey on united prakasam nellore districts says 14 mlas in danger zone no chance to these

దర్శిలో టీడీపీ ఇంచార్జ్ బంధువుల పేరుతో దందా అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్లు రైజ్ సర్వే విశ్లేషణలో తెలిపారు. వైసీపీ సీట్లు , ఎస్సీ స్థానాల్లో విపక్షం సేఫ్ అన్నారు. మద్యం కమీషన్లు, సెటిల్మెంట్ తో సర్కారుకు చెడ్డపేరు వస్తోందన్నారు.
కూటమి గెలిచిన ఎస్సీ స్థానాలు మరిచిపోవడమే మంచిదన్నారు. నెల్లూరు సిటీ, రూరల్ లో కూటమికి గుడ్ స్కోర్ ఉందన్నారు. అద్దంకిలో మంత్రి గొట్టిపాటిపైనా వ్యతిరేకత ఉందని సర్వేయర్ తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు మరో రిపోర్ట్ లో వెల్లడిస్తానని తెలిపారు.

ఉమ్మడి నెల్లూరు ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై రైజ్ సర్వే ఫలితాలను ఓసారి గమనిస్తే గతంలో వైసీపీ గెలిచి ఈసారి ఓడిపోయిన సీట్లు 2029 ఎన్నికల్లో తిరిగి గెలిచినా ఆశ్చర్యం లేదని అర్దమవుతోంది. అలాగే కూటమి పార్టీల ఎస్సీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తెలుస్తోంది. దీంతో పాటు మంత్రులపైనా వ్యతిరేకత వ్యక్తమవుతుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+