ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే

అమెరికా, ఇజ్రాయెల్‌- ఇరాన్‌ ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని రహదారుల నిర్మాణ పనులపై తీవ్రంగా పడింది. తారు, పారిశ్రామిక డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల పనులలో ఇబ్బంది చోటు చేసుకుంటుంది. రోడ్లకు సంబంధించి వేసవిలో పనులు చురుగ్గా సాగాల్సిన సమయంలో ఇది పెద్ద అవరోధంగా మారింది. రోడ్ల కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ఆసక్తి చూపడంలేదు.

బాగా పెరిగిన తారు ధరలు

ఈ పరిణామంతో జాతీయ రహదారుల్లోని వివిధ ప్రాజెక్టులతో పాటు ఆర్‌అండ్‌బీలో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు పశ్చిమాసియా నుండి ముడి చమురును శుద్ధి చేసి తారుగా మారుస్తాయి. ముడి చమురు సరఫరాలో అంతరాయాల వల్ల ఈ కంపెనీలు తారు ధరలను పెంచాయి.

Rising tensions between the US Israel and Iran have impacted road construction in Andhra Pradesh

టన్నుకు రూ.25 వేల వరకు అదనపు భారం

సహజంగా రోడ్ల నిర్మాణ వ్యయంలో 30-35 శాతం తారుకే వెచ్చించాల్సి ఉంటుంది. ఒక కిలోమీటరు పొడవున ఒక వరుస హైవే నిర్మాణానికి దాదాపు 10 టన్నుల తారు అవసరం. ఫిబ్రవరిలో టన్ను తారు ధర రూ.47 వేలు ఉండగా, ఇప్పుడు ఇది రూ.71-72 వేలకు చేరింది. దీంతో టన్నుకు రూ.25 వేల వరకు అదనపు భారం పడుతోంది.

బాగా పెరిగిన డీజిల్ ధర

గతంలో 45 రోజుల క్రెడిట్ సదుపాయం ఉండగా, ఇప్పుడు నగదు చెల్లించిన వారికి మాత్రమే తారు సరఫరా చేస్తున్నామని సంస్థలు స్పష్టం చేశాయి. ఇది కాంట్రాక్టర్లను వేచిచూసే ధోరణిలో ఉంచింది. హైవే నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టే పెద్ద కంపెనీలు అధికమొత్తంలో డీజిల్‌ను వినియోగిస్తాయి. పారిశ్రామిక అవసరాల కోసం గతంలో లీటరుకు రూ.83 వరకు ఉన్న డీజిల్ ధర ఇప్పుడు రూ.113కు చేరింది.

రాష్ట్రంలో 789 కి.మీ. జాతీయ రహదారులను నిర్మించాలని లక్ష్యం

లీటరుకు రూ.30 పెంపు అనేది వ్యయాన్నే కాకుండా రోడ్ల పనుల వేగాన్ని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తోంది. పెరిగిన ధరల ప్రభావం రోడ్ల అభివృద్ధి లక్ష్యాలపై పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 789 కి.మీ. జాతీయ రహదారులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, మార్చి నెలాఖరుకు లక్ష్యం కంటే 40 కి.మీ తక్కువగా హైవేల నిర్మాణం పూర్తయింది.

నెమ్మదిగా సాగుతున్న హైవేల పనులు

ఆర్‌అండ్‌బీ పరిధిలోని విస్తృతమైన రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు కూడా ఈ ధరల ప్రభావంతో పెద్దగా ముందుకు సాగటం లేదు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన రూ.100కోట్లలోపు అంచనా విలువ గల ప్రాజెక్టులలో ధరల పెంపునకు అవకాశం ఉండదు. తారు, డీజిల్, సిమెంట్ వంటి వాటి ధరలు పెరిగినా, కాంట్రాక్టర్లు ముందుగా ఒప్పందం చేసుకున్న మొత్తానికే పనులు పూర్తిచేయాలి. ఈ కారణంగా పలు హైవేల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

కాంట్రాక్టర్లు అధిక మొత్తంలో పెట్టుబడిగా పెడుతున్న పరిస్థితి

ధరలు పెరగటం కాంట్రాక్టర్ లకు చాలా ఇబ్బందిగా మారింది. అయితే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టులలో పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లింపులు చేసేందుకు వీలుంది. అయినప్పటికీ, కాంట్రాక్టర్లు అధిక మొత్తంలో పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుండటంతో వారు జాగ్రత్తగా అడుగేస్తున్నారు. ఈ అనిశ్చితి మొత్తం రహదారుల నిర్మాణ వేగాన్ని తగ్గిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+