శ్రీదేవి రెడ్డిని వెంటాడి చంపేశారు, వైసీపీపై రగిలిపోతున్న భూమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత వైసీపీ ప్రభుత్వం పడిపోయి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. ఇంతకాలం వైసీపీ ఆగడాలతో విసిగిపోయామని, ఇప్పుడు మా సత్తా చూపిస్తామని టీడీపీ నాయకులు కొన్ని నియోజక వర్గాల్లో అంటున్నారు. అయితే అదే టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు దారుణ హత్యకు గురైయ్యింది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పేరు చెబితే భూమా ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. నంద్యాల, ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ రాజకీయాలు కొత్తకాదు. ఇంతకాలం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియాతో పాటు ఆమె అనుచరులు, భూమా ఫ్యామిలీ అనుచరులు చాలా సైలెంట్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలీచారు.

భూమా అఖిలప్రియకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నా చివరికి అదిజరగలేదు. ఆళ్లగడ్డలో టీడీపీ నాయకులు ధైర్యంగా తిరగడం మొదలుపెట్టారు. టీడీపీ నాయకులు ఏవీ భాస్కర్ రెడ్డి, శ్రీదేవి దంపతులు కూడా తెలుగుదేశంలో చాలా చురుకుగా పని చేస్తున్నారు. చాలా కాలం నుంచి ఏవీ భాస్కర్ రెడ్డి మీద ప్రత్యర్థులు కన్ను వేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని ఏవీ భాస్కర్ రెడ్డి దంపతులు ధైర్యంగా తిరగడం మొదలుపెట్టారు.
మంగళవారం రాత్రి ఏవీ భాస్కర్ రెడ్డి, ఏవీ శ్రీదేవి దంపతులు పని మీద బయటకు బయలుదేరారు. సమయంలో కోసం వేచి చూసిన ప్రత్యర్థులు ఏవీ భాస్కర్ రెడ్డి, శ్రీదేవి దంపతుల మీద దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ నాయకురాలు శ్రీదేవి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీవ్రగాయాలైన శ్రీదేవి భర్త ఏవీ భాస్కర్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు.

విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శ్రీదేవి భౌతికకాయాన్ని పరిశీలించి పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ నాయకురాలు శ్రీదేవి హత్యకు గురికావడం, ఆమె భర్తకు తీవ్రగాయాలు కావడంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీదేవి హత్య కేసులో కొందరి మీద అనుమానం ఉందని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications