అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాస్టర్ ప్లాన్: రాజధానిలో ఏది ఎక్కడ? వాటిని చూసి అమరావతిలో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ గ్రామాలైన ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాలు నవ్యాంధ్రకి మెయిన్ బిజినెస్ సెంటర్ కానున్నాయి. ఈ గ్రామాలు కమర్షియల్ జోన్‌గా ఉండనున్నాయి.

ఉండవల్లి, పెనుమాకలు రిజర్వ్, ప్రొటెక్డెట్ జోన్లుగా మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. రాయపూడి గవర్నమెంట్ జోన్‌గా ఉండనుంది. ఇక్కడే అసెంబ్లీ, సచివాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తారు.

నిడమర్రు, నెక్కల్లు, వడ్డమాను, నులకపేట తదితర గ్రామాల్లో కాలుష్యరహిత పారిశ్రామిక కారిడార్‌గా ఉండనుంది. నేలపాడు, శాఖమరు, కృష్ణపట్నంలు ఎడ్యుకేషన్ జోన్‌గా విలసిల్లనున్నాయి. నులకపేట, బాపూజీనగర్‌లు లాజిస్టిక్ జోన్‌లుగా ఉంటాయి.

రివర్ ఫ్రంట్ బోరుపాలెం, అలాగే వెంకటపాలెం, ఉండవల్లి గ్రామాల్లోని రివర్ ఫ్రంట్ భూముల్లో వాటర్ రిలేటడ్ అమ్యూజ్‌మెంట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయనున్నారు.

రాయపూడి, తుళ్లూరు తదితర ప్రాంతాలు ప్రభుత్వ జోన్‌గా ఉండనుంది. నదికి ఆనుకొని ఉన్న ప్రాంతాలను విద్యా హబ్‌గా చేయనున్నారు. అక్కడే వరల్డ్ క్లాస్ విశ్వవిద్యాలయం రానుంది.

రాజధాని కోసం సేకరించిన 33,00 ఎకరాలను వ్యవసాయ జోన్, అర్బన్ జోన్, పారిశ్రాక జోన్, అభివృద్ధి కారిడార్ జోన్, మౌలికాసదుపాయాల జోన్, ప్రొటెక్షన్ జోన్‌గా విభజించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్, ప్రభుత్వ నగర కార్యాలయం, పార్కులు, కేంద్ర గ్రంథాలయం, క్రికెట్ స్టేడియం, జూపార్క్, ఆర్ట్స్ కేంద్రం, మ్యూజియం, సిటీ స్క్వేర్స్, హైకోర్టు.. ఇవన్నీ నగరం చుట్టూ ఏర్పాటు కానున్నాయి.

Riverfront to be business hub, anti-LPS areas reserved

ఆ నగరాలకు స్ఫూర్తి ఏమిటి?

గవర్నమెంట్ జోన్ - ఆస్తానా (కజకిస్తాన్) గాంధీ నగర్ (గుజరాత్)
మెడికల్ సిటీ - హెల్త్ కేర్ సిటీ (దుబాయ్), నోవెనాహెల్త్ సిటీ (సింగపూర్)
స్పోర్ట్స్ సిటీ - క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ (లండన్), ఒలింపిక్ పార్క్ (మెల్బోర్న్)
జస్టిస్ సిటీ - సిటీ సెంటర్ (కాన్ బెర్రా), న్యూయార్క్ (అమెరికా)
ఎడ్యుకేషన్ సిటీ - ఎడ్యుకేషన్ సిటీ (దోహా), గ్రేటర్ నోయిడా నాలెడ్జ్ పార్క్ (ఉత్తర ప్రదేశ్)
టూరిజం సిటీ - సింటోజా ఐలాండ్ (సింగపూర్)
ఎలక్ట్రానిక్ స్టీ - వన్ నార్త్ (సింగపూర్), ఎలక్ట్రానికి సిటీ (బెంగళూరు)
ఫైనాన్స్ సిటీ - బిజినెస్ డిస్ట్రిక్ట్ (హాంకాంగ్), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (వ్యాంక్యూవర్)
మీడియా సిటీ - డిజిటల్ మీడియా సిటీ (సియోల్), మీడియా సిటీ యూకే (మాంచెస్టర్)

English summary
The riverfront villages of Uddandarayunipalem, Lingayapalem and Tallayapalem will form into the main business center of AP’s new capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X