రోజా సైలెంటయ్యారు! ఎందుకంటే..?: అంతా ఆ ప్రభావమేనా?

Subscribe to Oneindia Telugu
  YSRCP Roja maintaining silence, Know Why? రోజా సైలెంటయ్యారు! ఎందుకంటే..? | Oneindia Telugu

  అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో, అంతకుముందుకు కూడా తరచూ అధికార పార్టీ, సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే రోజా ఈ మధ్య మీడియాలో కనిపించకపోవడం చర్చకు దారితీసింది.

  రోజా సైలెంట్ కావడానికి అదే కారణమా..?

  రోజా సైలెంట్ కావడానికి అదే కారణమా..?

  కాగా, రోజా ఇలా సైలెంట్ అయిపోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను సైలెంట్‌గా ఉండమన్నారా? అనే సందేహం కలుగుతోంది.

  ఓటమికి రోజా వ్యాఖ్యలే కారణం...?

  ఓటమికి రోజా వ్యాఖ్యలే కారణం...?

  ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు రావడానికి రోజా చేసిన వ్యాఖ్యలే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రచారం సందర్భంగా అభ్యంతరకర పదజాలాన్ని వాడటమే కాకుండా, మంత్రి అఖిలప్రియ చుడీదార్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీకి ఓట్లను దూరం చేశాయనే భావన పార్టీ నేతల్లో ఉందట.

  కొంత కాలం తప్పదు..

  కొంత కాలం తప్పదు..

  ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు సెలెంట్‌గా ఉండాలంటూ పార్టీ అధిష్టానం రోజాకు సూచించినట్లు సమాచారం. దీంతో రోజా ప్రస్తుతం తన నియోజకవర్గం నగరిపైనే దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ప్రజల మధ్య గడుపుతున్నారు.

  నిరాశలో..

  నిరాశలో..

  ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ తోపాటు రోజా, ఇతర నేతలు నంద్యాలలో పర్యటించి విస్తృత ప్రచారం చేశారు. కానీ, నంద్యాల, కాకినాడ ఓటర్లు మాత్రం టీడీపీకే మొగ్గుచూపారు. దీంతో వైసీపీ శ్రేణులు కొంత నిరాశకు గురయ్యాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress MLA RK Roja has maintaining silence in recent times because of their party High Command.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి