దూసుకొచ్చిన లారీ: పాల కోసం వెళ్లిన ముగ్గురు బాలికలు మృతి
కర్నూలు: జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలు కొనుగోలు చేసి ఇంటికి వెళుతున్న ముగ్గురు బాలికలపైకి అతివేగంగా వచ్చిన లారీ దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో మణి (12), రాజేశ్వరి (16), తిరుపతమ్మ (14 ) తీవ్ర గాయాలతో మృతి చెందారు. బాలికలను ఢీకొట్టిన లారీ అదే వేగంతో 100 అడుగుల దూరం వెళ్లి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది.
దీంతో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కొలిమిగుండ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు బాలికల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది ఇలా ఉండగా, ఆళ్లగడ్డ మండలం చింతకొమ్ముదిన్నె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. అంబులెన్స్, ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

గోదాములో భారీ అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు వద్ద జీడిపప్పు గోదాములో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యువశంకర్ ట్రేడర్స్‌కు చెందిన గోదాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి.
అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. రెండు మూడు గంటల తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. సుమారు 2వేల బస్తాల జీడిపప్పు దగ్ధమైపోయిందని గోడౌన్ నిర్వాహకులు తెలిపారు.












Click it and Unblock the Notifications