పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ: నలుగురు మృతి, పలువురికి గాయాలు

అనంతపురం: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌‌ను ఓ లారీ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

ఈ ఘటన ఓడీసీ మండలం గాజుకుంటపల్లి వద్ద చోటుచేసుకుంది. పెళ్లి ట్రాక్టర్‌ దిగువపల్లి నుంచి కదిరికి వెళ్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న లారీ.. పెళ్లి ట్రాక్టర్‌ను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా, పలువురు గాయలయ్యాయి.

 Road accident in Anantapur district: Four killed, few injured

పెళ్లికొడుకు తల్లి లక్ష్మమ్మ, సమీప బంధువులైన చిన్నారులు నాగేశ్వరి(12) మంజునాథ్(10) కార్తీక్(12)లు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

మరో పది నిమిషాల్లో పెళ్లి మంటపానికి ఈ బృందం చేరుకునేది. అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి దేవాలయం లో వివాహం జరగాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+