పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తూ పైలోకాలకు.. ఆరుగురు స్పాట్ డెడ్ !
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్టు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులంతా స్టువర్టుపురం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తూ ఓకే కుటుంబానికి చెందిన వారంతా మరణించడం పట్ల వారి ఆప్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications