రోడ్డు ప్రమాదం: జగన్ పార్టీ ఎమ్మెల్యేకు గాయాలు
నెల్లూరు: జిల్లాలోని నాయడుపేట వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గాయాలయ్యాయి. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో ప్రతాప్‌కుమార్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కడప జిల్లా రాజంపేట మండలం రామాపురం గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మాపురం వద్ద గురువారం వేకువజామున 2.50 గంటలకు రెండు తుఫాన్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్నమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు.
తీవ్రంగా గాయపడిన 20 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ప్రమాదం జరిగిన విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications