ఘోర ప్రమాదానికి ముగ్గురు బలి.. ఎక్కడంటే ??
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరంలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని కీలక రహదారి అయిన రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో నగరవాసులు తీవ్రంగా కలత చెందారు.
రెండు బైక్‌లు ఢీ..
ప్రాథమిక సమాచారం ప్రకారం, సోమవారం సాయంత్రం రెండు పల్సర్ బైక్‌లు అధిక వేగంతో బ్రిడ్జిపై ప్రయాణిస్తూ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఢీ ప్రభావంతో బైక్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

బ్రిడ్జిపై తీవ్ర ట్రాఫిక్ జామ్..
ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సాయంత్రం రద్దీ సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే రాజమండ్రి టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, వాహనాలను తొలగించి రహదారిని క్రమంగా తెరిచారు.
మృతదేహాల తరలింపు..
ప్రమాదంలో మృతి చెందిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, బ్రిడ్జిపై పరిమిత వెడల్పు వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై గతంలో కూడా ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, భద్రతా చర్యలు మరింత కఠినతరం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. వేగ నియంత్రణ, ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన అమలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications