నో స్పెషల్ స్టేటస్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీకి రోడ్ మ్యాప్
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రత్యేక హోదా శకం ముగిసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన నేపథ్యంలో ఇక ప్యాకేజీపైనే ఆంధ్రప్రదేశ్ అశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.2,25,484 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. తాజాగా వాటిలో కొన్ని మార్పుచేర్పులు చేసింది. కొత్తగా రూ.1,892 కోట్ల మేరకు వివిధ పథకాలను చేర్చింది.
Photos: అమరావతి శంకుస్థాపన
మొత్తంగా నవ్యాంధ్ర అభివృద్ధికి రానున్న ఐదేళ్లలో రూ.2,27,766 కోట్ల ప్యాకేజీని ఇవ్వాలని కోరింది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీపై నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ తయారు చేస్తోంది. వారం రోజులుగా ఎపికి ప్యాకేజీపై దృష్టి సారించిన నీతి ఆయోగ్ ఏపీకి చెందిన సీనియర్ అధికారులతో శుక్రవారం కూడా సమావేశమైంది.
ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.రమేశ్ సవరించిన ప్యాకేజీ ప్రతిపాదనలను నీతి ఆయోగ్‌కు అందజేశారు. ఆయా రంగాల వారీగా ఏపీకి కావాల్సిన నిధుల చిట్టాను నీతి ఆయోగ్‌కు అధికారులు సమర్పించినట్లు వార్తలు వచ్చాయి.













Click it and Unblock the Notifications