ఏపీలో రోడ్లకు మోక్షం.. యాక్షన్ ప్లాన్ చెప్పిన మంత్రి బిసి జనార్థన్ రెడ్డి

రాష్ట్రంలో దెబ్బతిన్నఆర్అండ్ బీ రహదారులకు యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి, గుంతలు లేని రోడ్లుగా చేయడమే తక్షణ లక్ష్యమని, రాష్ట్ర రోడ్లు భవనాలు,పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల వేద ఆశ్వీర్వచనాల మధ్య ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఏపీలో రోడ్లకు మోక్షం
ఈసందర్భంగా మంత్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గుంతలమయంగా మారిన రోడ్లకు మోక్షం రానుందన్నారు. 2014-19లో ఆర్ అండ్ బి శాఖకు బడ్జెట్లో రూ.14,970కోట్ల రూపాయలు కేటాయిస్తే రూ.12,064కోట్లు, 80 శాతం ఖర్చు చేసి రోడ్లను బాగు చేశామన్నారు. అదే గత ప్రభుత్వ హయాం 2019-24లో ఆర్ అండ్ బి కి రూ.19,428కోట్లు బడ్జెట్లో నిధులు కేటాయించి కేవలం రూ.9,015 కోట్లు అనగా 46శాతం మాత్రమే ఖర్చు చేశారన్నారు.

Roads repairs in AP Roads and buildings Minister BC Janardhan Reddy said the action plan

గత ప్రభుత్వ హయాంలో రోడ్ల మరమ్మత్తులు లేవు
అంతేగాక గత ప్రభుత్వంలో జరిగిన రూ.2 వేల 261 కోట్లకు బిల్లులు చెల్లించ లేదని దానివల్ల పనులు చేసినా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మంత్రి జనార్థన రెడ్డి పేర్కొన్నారు. గత ఐదేళ్ళలో తగినన్నినిధులు మంజూరు చేయని కారణంగా రోడ్లకు మరమ్మత్తులు చేపట్టడం గుంతలు పూడ్చడం జరగలేదని అన్నారు.

ఏపీలో 9080 కిలోమీటర్ల రోడ్లు అధ్వాన స్థితిలో
ప్రస్తుతం దాదాపు 9080 కిలోమీటర్ల రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని తక్షణం 8161కిలోమీటర్లు ప్రధాన జిల్లా రహదార్లు,3340కిలోమీటర్ల రాష్ట్ర రహదార్లు ప్రత్యేక మరమత్తులకై ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. దెబ్బతిన్న రహదారులను మరమ్మత్తులు చేపట్టి రోడ్లలో గుంతలు లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జిల్లా అధికారులు నుండి గుంతలను పూడ్చుటకు, అత్యవసర మరమత్తు లకు రూ.284కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయని మంజూరుకు పరిశీలన చేస్తున్నట్టు మంత్రి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్ల మరమ్మత్తులకు తక్షణ ప్రాధాన్యత
ప్రస్తుతం రాష్ట్రంలో 8164 కి.మీల జాతీయ రహదార్లు,12,653 కి.మీల రాష్ట్ర రహదార్లు, 27,062 కి.మీల ముఖ్య జిల్లా రహదారులు, 5663 గ్రామీణ రహదారులు కలిపి మొత్తం 53వేల 542 కి.మీల రహదారులు ఉండగా వాటిలో 45,378 కి.మీలు రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయని మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మత్తులకు తక్షణ ప్రాధాన్యత ఇచ్చి రిపేర్లు చేస్తామన్నారు మంత్రి జనార్ధన్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+