అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యాపారి కంట్లో కారంచల్లి దోపిడీ: రూ. 80లక్షల విలువైన బంగారం చోరీ

|
Google Oneindia TeluguNews

Robbers looted a merchant in Anantapur district
అనంతపురం: ఓ బంగారు నగల దుకాణం యజమాని కళ్లల్లో కారంచల్లి రూ. 80లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయిన సంఘటన ధర్మవరం పట్టణంలో సంచలనం సృష్టించింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మరవరంలోని అంజుమన్ సర్కిల్‌లో ఖాజాహుస్సేన్ అనే వ్యక్తి, అల్లాబకాష్ డిజైనర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.

ఇతను ప్రతి రోజు తన దుకాణంలో ఉన్న బంగారు నగలను ఇంటికి తీసుకుపోయి ఉదయం దుకాణానికి తీసుకువస్తుండేవాడు. ఇదే క్రమంలో ఆయన సోమవారం సాయంత్రం దుకాణంలోని నగలను బ్యాగులో ఉంచుకుని ఇంటికి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. ప్రణవసాయి ప్రైవేటు స్కూల్ వద్దకు వెళ్లగానే అక్కడే మాటువేసిన ఆరుగురు దుండగులు వ్యాపారి కళ్లలో కారం కొట్టి బంగారం బ్యాగును తీసుకుని పరారయ్యారు.

ఖాజా హుస్సేన్ కేకలు వేయడంతో సమీపంలోని స్థానికులు అప్రమత్తమయ్యారు. రెండు బైకులపై వెళ్తున్న ఆరుగురు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఐదుగురు తప్పించుకోగా.. ఒక దుండగుడు స్థానికులకు చిక్కాడు. ఆ దండగుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన దుండగుడి నడుం చుట్టూ కారంపొడి కట్టుకుని ఉండటం, అదే కారంపొడితోనే తనను పట్టుకోవడానికి వచ్చిన స్థానికులపై కారంచల్లి వారిపై దాడికి యత్నించాడని తెలిసింది.

అయినా స్థానికులు వెంటపడి అతడ్ని పట్టుకున్నారు. అతడి పేరు వెంకటేష్ అని, బళ్ళారికి చెందిన వ్యక్తని పోలీసులు విచారణలో వెల్లడైంది. సాయంత్రం వేళల్లో అత్యంత రద్ధీగా ఉండే అంజుమన్ కూడలిలో ఘటన చోటుచోటుచేసుకోవడం, నిందితులు నగలతో ఉడాయించడం స్థానికుల్లో బయాందోళనలు రేకెత్తుతున్నాయి.

సోమవారం రాత్రే ఈ దోపిడీ కేసులో మరో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగితా దుండుగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, దొంగతనం విషయం తెలుసుకున్న బంగారు వ్యాపారులు, మైనార్టీలు పెద్ద ఎత్తున పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. ఆ దుండగుడిని తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
Robbers looted a merchant in Dharmavaram in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X