వాళ్ల పిల్లలే కీచకులు: రోజా సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం: అధికార పార్టీ నేతలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీచక పాలన సాగుతోందని ఆమె ఆరోపించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె గురువారంనాడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ నేతల పిల్లలే కీచకులుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆమె అన్నారు.

నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో విధిలేకనే ప్రిన్సిపాల్ బాబూరావును అరెస్టు చేశారని ఆమె అన్నారు. తహశీల్దార్ వనజాక్షి వ్యవహారాన్ని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో మాట్లాడి చంద్రబాబు సెటిల్ చేశారని రోజా అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చీటింగ్ చీఫ్ మినిస్టర్‌గా బిరుదు ఇవ్వవచ్చునని ఆమె వ్యాఖ్యానించారు రాష్ట్ర బడ్జెట్‌ను ఇంగ్లీషులో చదవడం దురదృష్టకరమని అన్నారు. బడ్జెట్‌లో మహిళలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆమె తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications