బాలయ్య కు రోజా ఫోన్ - మంచి మూడ్ లో ఉంటే ఓకే..లేకపోతే : కొత్త ప్రొపోజల్.. రిప్లై అదుర్స్..!!

వైసీపీ ఫైర్ బ్రాండ్..నగరి ఎమ్మెల్యే రోజా ఒక ఇంట్రస్టింగ్ ఇష్యూలో భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం రాజకీయాలు..జబర్ధస్త్ లో బిజీగా ఉన్న రోజా తాజాగా ఒక ఫోన్ కాల్ తో అందరినీ అట్రాక్ట్ చేసారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే..సినీ హీరో బాలయ్యకు ఫోన్ చేసారు. ఇద్దరూ చలా క్లోజ్ గా..నవ్వుకుంటూ మాట్లాడుకున్న ఆ ఫోన్ కాల్ దసరా రోజున సందడి చేస్తోంది. రోజా పాల్గొంటున్న ఒక కామెడీ షో లో భాగంగా...యాంకర్ తమ అందరి సమక్షంలో బాలయ్య బాబుకు ఫోన్ చేయాలంటూ రోజాను కోరుతారు.

ఆ వెంటనే మంచి మూడ్ లో ఉంటే ఓకే..లేకపోతే అంటూ ఫోన్ తీసుకుంటారు. ఆ మాట అనటంతో అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ బాలయ్య మార్క్ రియాక్షన్ అంచనా వేస్తూ నవ్వుల్లో మునిగిపోతారు. ఇక, రోజా ఫోన్ చేయగానే..అవతలి వైపు నుంచి బాలయ్య ఫోన్ లిఫ్ట్ చేస్తూనే నమస్కారం రోజా గారు అంటూ పలకరిస్తారు..దీనికి రోజా సైతం బాగున్నారా అంటూ బాలయ్యను పలకరించారు. మీరెలా ఉన్నారంటూ బాలయ్య తిరిగి అడగటంతో..బాగున్నా సార్..నేను ప్రోగ్రాంలో ఉన్నా..మీరు ఏం చేస్తున్నాంటూ రోజా ప్రశ్నించారు.

తాను షూటింగ్ లో ఉన్నానంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు. వెంటనే రోజా..మనిద్దరం కలిసి తిరిగి ఎప్పుడు యాక్ట్ చేద్దాం... భైరవ ద్వీపం పార్ట్ 2 నా లేక బొబ్బలి సింహం పార్ట్ టు నా అని అడుగుతున్నారంటూ రోజా సమాధానం ఇస్తారు. దీనికి బాలయ్య గట్టిగా నవ్వేస్తూ..అందరూ ఎదురు చూస్తున్నారు మన కాంబినేషన్ కోసం అంటూ సమాధానం ఇచ్చారు. అదే సమయంలో అక్కడ ఎన్న కంటెస్టెంట్స్ ను పలకరించిన బాలయ్య...వాళ్లు అందరికంటే పెద్దవాళ్లని..తన వయసు గురించి చెప్పటంతో అందరూ ఆ ఫోన్ కాల్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.

ఇక, ఈ ప్రోమో దసరా పండుగ నాడు అటు బాలయ్య..ఇటు రోజా ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది. ఇద్దరూ ఎమ్మెల్యేలే. ఇద్దరూ రాజకీయంగా భిన్న పార్టీల్లో ఉన్నారు. కానీ, ఇద్దరి మధ్య అంత సరదాగా సాగిన సంభాషణ ఇప్పుడు ఆనందాన్ని పంచుతోంది. రాజకీయంగా గతంలో అసెంబ్లీలో ఒక సారి బాలయ్య చేసిన వ్యాఖ్యలు గురించి రోజా ప్రశ్నించటం మినహా.. వారిద్దరి మధ్య రాజకీయంగానూ పెద్దగా విభేదాలు చోటు చేసుకున్న సందర్భాలు లేవు.

Roja calls Balakrishna , comes up with a new proposal and you know what the latters reply was?

ఇక, వైసీపీ నేతలు సైతం బాలయ్య మీద ఏ రోజున భారీ విమర్శలు చేయలేదు. ఇప్పుడు బాలయ్య - రోజా ఫోన్ ఎపిసోడ్ అటు పొలిటికల్ ...ఇటు సినీ-టీవీ సర్కిల్స్ ల్లోనూ మంచి ఎంజాయ్ మెంట్ ఇస్తోంది. ఆ కామెడీ షోలోని పార్టిసిపెంట్స్ గురించి బాలయ్య పేరు పేరునా పలకరించటం మరింత హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+