చంద్రబాబు ఫోటోపై చెత్త వేశారని, నారాయణ-గంటాలను తొలగించండి: రోజా

కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం ఘాటుగా స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

అమరావతి: కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం ఘాటుగా స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

కాసుల కోసం ఎంతమందిని బలి తీసుకుంటారని నిలదీశారు. కార్పోరేట్ కాలేజీలపై తల్లిదండ్రులు ఎదురు తిరగాలని సూచించారు. ఆత్మహత్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం బాధ లేదన్నారు. 40 మంది పిల్లలు చనిపోయినా చర్యలు లేవన్నారు.

Roja demands for Ganta and Narayana dismess

నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. విశాఖపట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిందిత కాలేజీపై ఏ చర్యలు తీసుకున్నారన్నారు.

దీనికి కారణమైన నారాయణ, చైతన్య కాలేజీల యాజమాన్యాలకు ఏ శిక్షలు విధించారన్నారు. విద్యాశాఖ మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. కేవలం వియ్యంకుడు అన్న కారణంతో గంటా శ్రీనివాస రావు.. మంత్రి నారాయణను రక్షిస్తున్నారన్నారు.

కేవలం చంద్రబాబు ఫోటో పైన చెత్త వేశారని ఐఏఎస్ అధికారిణితో విచారణకు ఆదేశించారని, మరి పిల్లల జీవితాలను హరిస్తున్న నారాయణ, చైతన్యలపై విచారణకు ఎలాంటి సంఘాన్ని ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కేబినెట్ నుంచి గంటాను, నారాయణలను తొలగించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+