రోజా ఇష్యూ-రాజకీయం: భగవద్గీతపై ప్రమాణం.. కొలిక్కి వచ్చేనా!?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా అంశం... తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా కనిపిస్తోంది. రోజా విషయంలో ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం తగ్గేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నాయి.
ఇందుకు బుధవారం నాడు ప్రివిలేజ్ కమిటీ ఎదుట రోజా హాజరైన తర్వాత.. పరస్పర విరుద్ధ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చునని అంటున్నారు. టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత పైన వ్యాఖ్యల నేపథ్యంలో రోజా బుధవారం మధ్యాహ్నం ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. తన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చారు.
ప్రివిలేజ్ కమిటీ ఎదుట రోజా ఇచ్చిన వివరణ పైన వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాను అతనిను ఏమీ అనలేదని రోజా గట్టిగా వాదించారని తెలుస్తోంది. అదే సమయంలో తాను వ్యాఖ్యానించిన మాట నిజమేనని, కానీ ఆ వ్యాఖ్యలు అనితను ఉద్దేశించి వ్యాఖ్యానించారని మరికొందరు చెబుతున్నారు.
మొత్తానికి అనిత విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని రోజా చాలాసేపు గట్టిగా వాదించారని తెలుస్తోంది. ఆధారాలు ఉన్నాయని ప్రివిలేజ్ కమిటీ సభ్యులు చెప్పారని, దాంతో రోజా.. అనితను ఉద్దేశించి అనలేదని, అయినా ఒకవేళ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని, క్షమాపణ చెబుతున్నానని చెప్పారని అంటున్నారు.

ప్రివిలేజ్ కమిటీ భేటీ అనంతరం సభ్యులు (టిడిపి వారు) మాట్లాడుతూ.. అనిత విషయంలో రోజా వెనక్కి తగ్గారని, విచారం వ్యక్తం చేశారని చెప్పారు. రోజా మాత్రం తాను క్షమాపణ చెప్పలేదని, కేవలం వెనక్కి తీసుకున్నానని చెబుతున్నారు.
ప్రివిలేజ్ కమిటీ కమిటీ ఎదుట రోజా హాజరైతే.. ఏదో ఒక పరిష్కారం జరిగి, సమస్య ముగిసిపోతుందని చాలామంది భావించారు. కానీ అంతలోనే ఆమె కమిటీ ముందు హాజరైనందుకు.. అసలు క్షమాపణ చెప్పారా, లేదా అనే కొత్త వివాదం ముందుకు వచ్చింది.
మొత్తానికి రోజా విషయంలో అధికార పార్టీ సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తోందని, అదే సమయంలో రోజా లేదా వైసిపి కూడా అంతే సీరియస్‌గా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. రోజా సస్పెన్షన్ అంశం, సీఎం, స్పీకర్, అనితల పైన చేసిన వ్యాఖ్యల విషయమై ఓ కొలిక్కి వచ్చేనా అనే చర్చ సాగుతోంది.
ప్రివిలేజ్ కమిటీలో ఏం జరిగింది?
తాను అనకపోయినా ప్లాన్ ప్రకారం తనపై ఈ అభియోగం మోపి సభ నుంచి సస్పెండ్ చేయడమే గాక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రివిలేజ్ కమిటీ ఎదుట రోజా వాదించారు. సభలో జరిగిన సంభాషణలు, ప్రొసీడింగ్స్‌కు సంబంధించి ఆడియో వీడియో సీడీలను తనకిచ్చారని అందులో ఎక్కడా తాను తప్పుగా మాట్లాడినట్లుగా లేదన్నారు.
సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి రెండు ఫిర్యాదులున్నాయని వాటిపై మాత్రమే తాము విచారణ చేస్తాం తప్ప, ఇతర విషయాలు తమ పరిధిలోకి రావని కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యారావు, సభ్యులు ఆమెకు స్పష్టం చేశారని తెలుస్తోంది.
ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన భేటీలో సభ్యులు సత్యనారాయణ మూర్తి, బిసి జనార్దన్ రెడ్డి, రామకృష్ణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హాజరయ్యారు. తొలుత రోజాతో భగవద్గీత పైన ప్రమాణం చేయించారు.
అనితను తానేమీ అనలేదని, అయినా తప్పుగా అర్థం చేసుకుని ఉంటే తన మాటలను కావాలంటే ఉపసంహరించుకుంటాని రోజా చెప్పారని తెలుస్తోంది. కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కల్పించుకుని కావాలంటే అని ఎందుకు ఉపసంహరించుకుంటానని స్పష్టంగా చెప్పేయండని సూచించారని, అందుకు ఆమె అంగీకరించారని తెలుస్తోంది. అయితే, ఆమె క్షమాపణ పైన ఆ తర్వాత చర్చ జరగడం గమనార్హం.
ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఇదిలా ఉండగా, రోజా క్షమాపణ విషయాన్ని పక్కన పెడితే.. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పడం గమనార్హం. రోజా క్షమాపణతో ప్రభుత్వం ఏం చేస్తుందోననే ఆలోచనలో అందరూ పడ్డారు. తన వ్యాఖ్యల పైన రోజా మొండికేస్తే ఆమె సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చునని ప్రభుత్వం భావించింది.
ఇప్పుడు ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో (క్షమాపణలు చెప్పినా, చెప్పకపోయినా) ఆమె సస్పెన్షన్ విషయమై ప్రభుత్వం పట్టుదలగా ముందుకు వెళ్లే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే, సుప్రీం తీర్పు రోజాకు అనుకూలంగా వస్తే ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి చెందలేదన్న వంకతో ఏడాది సస్పెన్షన్ కొనసాగిస్తుందా? లేక ఏం చేస్తుందనే చర్చ సాగుతోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications