సినిమాలు అడ్డుకుంటున్నారు: జూ.ఎన్టీఆర్‌ని లాగిన రోజా, సుప్రీంకోర్టుకు
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోసం ఆ పార్టీ వారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అడ్డు పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రోజాను ఏడాది పాటు ఏపీ అసెంబ్లీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమెకు హైకోర్టు సింగిల్ బెంచ్‌లో అనుకూలంగా తీర్పు రావడంతో, ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ఆమెకు అక్కడ చుక్కెదురైంది.
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ తీర్పు పైన స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే శుక్రవారంపై ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో మహిళల సమస్యల పైన నిలదీస్తున్నందుకే తనను ప్రభుత్వం తొక్కివేస్తోందని మండిపడ్డారు.

ప్రివిలేజ్ కమిటీ నుంచి తనకు పిలుపు వస్తుందని ఎదురు చూశానని, కానీ ఇప్పటి వరకు రాలేదని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో తూట్లు పొడిచిందన్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారని ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ పేరుతో తెచ్చిన పథకాలను సరిగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ వారసులను ఎన్నికల సమయంలో కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకొని వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అడ్డుపడుతున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీని ఆమె తెలుగు దొంగల పార్టీగా రోజా అభివర్ణించారు. తన పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాను 18వ తేదీన మాటలు అంటే, మూడు రోజుల పాటు టిడిపి ఎమ్మెల్యే అనిత ఎందుకు స్పందించలేదన్నారు. అనితను సీఎం చంద్రబాబు బలిపశువును చేస్తున్నారన్నారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను మహిళల కోసమే పోరాడుతున్నానని రోజా చెప్పారు. తనకు సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. తాను డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేశామని చెప్పారు. ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించిన చంద్రబాబుకు ఆయన విగ్రహానికి పూలమాల వేసే నైతిక అర్హత లేదన్నారు. ఎన్టీఆర్ పేరుకు అపకీర్తి తెచ్చేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ పేరు వినపడకూడదని జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన పప్పుసుద్ద కొడుకు లోకేష్ ఎదగడనే భయం చంద్రబాబుకు ఉందన్నారు. అందుకే జూనియర్‌ను తొక్కేస్తున్నారన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ సిద్ధాంతాలను పక్కన పెట్టిన ఈ మోసగాడికి (చంద్రబాబును ఉద్దేశించి) ఆయనకు పూలమాల వేసే నైతిక అర్హత లేదన్నారు. ఎన్టీఆఱ్ సమైక్యాంధ్రకు కట్టుబడి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే, చంద్రబాబు మాత్రం జతకలిసి రాష్ట్రాన్ని విడదీశారన్నారు.
ఎన్టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే, చంద్రబాబు మాత్రం బెల్టు షాపులతో మద్యాన్ని పొంగిస్తూ ఆడపడచుల జీవితాలు నాశనం చేస్తున్నారన్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలకు సమాధి కట్టేశారన్నారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు ఎంత కక్ష ఉందో అందరికీ తెలుస్తోందన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications