వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ నుంచి వేటు: హైకోర్టు డివిజన్ బెంచ్‌కెక్కిన రోజా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఈ నెల 9కి వాయిదా వేయడాన్ని ప్రశ్నిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషనర్‌ తరపున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ మంగళవారం వాదనలు విన్పించారు.

రోజా సస్పెన్షన్‌పై దాఖలైన వ్యాజ్యంలో శాసన వ్యవహారాల శాఖ, అసెంబ్లీ కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయకుండా వాయిదా కోరారని, ఈ నెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున 9వ తేదీకి వాయిదా వేయడం వల్ల పిటిషనర్‌ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కోల్పోతారని తెలిపారు.

కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏదో ఒక సాకుతో వాయిదా కోరుతున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం సభ నుంచి సస్పెండ్‌ చేసే అధికారం ఒక సెషన్‌కు మాత్రమే పరిమితం చేయాలన్నారు.

Roja files petition in High Court division bench

దానిపై అదనపు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత నెల 17న ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి 24న అందాయని, వాదనలు చెప్పాలని తనను కోరారని, ఆ విషయాన్నే కోర్టుకు చెప్పి వాయిదా కోరానని తెలిపారు.

ఆర్టికల్‌ 194(3) ప్రకారం సభా మర్యాదలు పాటించని సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేయవచ్చని చెప్పారు. ఈ వాదనలు విన్న హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందున్న కేసు విచారణను 9వ తేదీ కంటే ముందుగానే చేపట్టాలని కోరతామని స్పష్టం చేస్తూ విచార ణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేసింది.

English summary
YSR Congress MLA Roja challenged single judge decision on her suspension from assembly in High Court division bench
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X