Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇన్నేళ్లేం చేశారని కోర్టు అడిగితే తలలు ఎక్కడ: బాబుపై రోజా, కిరణ్ రెడ్డి-పవన్‌లపైనా

నగరి: రాష్ట్రాన్ని దోచుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అబద్దాల కోరు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై ఊహాలోకంలోకి తీసుకెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. బుల్లెట్ ట్రైన్ ఎక్కడుందో చెప్పాలని, మీ ఇంట్లో మీ మనవడు దేవాన్ష్ ఆడుకుంటున్నాడా అని ప్రశ్నించారు.

Recommended Video

    బాబు పై ఓటుకు నోటు కేసు: 'మోడీ-కేసీఆర్ గేమ్'

    యాపిల్ కంపెనీ విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్‌లో ఉందా అని ఎద్దేవా చేశారు. దోచుకుంది దాచుకోవడానికే చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లారని విమర్శించారు. నాలుగేళ్లైనా అమరావతిలో 4 అడుగుల పిట్టగోడ కట్టలేని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇక ఆయన ప్రపంచ అద్భుత రాజధాని ఏం కడతారన్నారు.

    నాలుగేళ్లు ఏం చేశారని అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటారు?

    నాలుగేళ్లు ఏం చేశారని అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటారు?

    ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జట్టుకట్టిన దుష్టుడు చంద్రబాబు అని రోజా ఆరోపించారు. ఈ నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా, విభజన హామీలపై గాడిదలు కాశారా అని నిలదీశారు. నాలుగేళ్ల పాటు విభజన హామీలపై ఏం చేశారని కోర్ు అడిగితే తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.

    యనమల ఓ దద్దమ్మ

    యనమల ఓ దద్దమ్మ

    ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓ దద్దమ్మ అని రోజా విమర్శించారు. ఆయనకు వయసు మీదపడటంతో యనమల బుర్ర పని చేయడం లేదని విమర్శించారు. ఏపీ విభజనకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కారణమని చెప్పారు. గత్యంతరం లేకే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు అబద్దాల కోరు అన్నారు.

    వైయస్ లేని లోటు కనిపిస్తోంది

    వైయస్ లేని లోటు కనిపిస్తోంది

    నేడు వైయస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతిని పురస్కరించుకొని నగరి ఎమ్మెల్యే రోజా వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రతి గుండే ఇప్పటికీ వైయస్సార్‌ని తలుచుకుంటోందని రోజా అన్నారు. వైయస్సార్‌ అనేది పేరు కాదని, బ్రాండ్‌, విశ్వసనీయత, నమ్మకానికి మారు పేరు అన్నారు. వైయస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. తొమ్మిదేళ్ల పాలనలనో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

     టీడీపీ మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారు

    టీడీపీ మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారు

    వైయస్ రాజశేఖర్‌రెడ్డిలాగే సంక్షేమాన్ని అందించగలిగే, వైయస్సార్ వారసత్వాన్ని నిలబెట్టగలిగే వ్యక్తి జగన్‌ మాత్రమే అని రోజా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది దోచుకొని దాచుకునే నైజమన్నారు. బాబు అసమర్ధత సీఎం అని, విదేశీ పర్యటనలో పేరుతో దోచుకున్న డబ్బుని దాచి వస్తున్నారన్నారు. సీఎం, టీడీపీ మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అఫిడవిట్‌ విషయంలో సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+