లోకేష్ ఓ పప్పు! ఆయనో ఎర్రిపప్పు: రోజా తీవ్ర వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి మంత్రులు నారా లోకేష్, అయ్యన్నపాత్రుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కొత్తగా మంత్రి అయిన లోకేష్ ఓ పప్పు.. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు ఎర్రిపప్పు’
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి మంత్రులు నారా లోకేష్, అయ్యన్నపాత్రుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'కొత్తగా మంత్రి అయిన లోకేష్ ఓ పప్పు.. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు ఎర్రిపప్పు' అంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
విశాఖకు రైల్వేజోన్ ప్రకటించాలనే డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్రలో గురువారం ఆమె ప్రసంగించారు. అయ్యన్నపాత్రుడికి ఏజెన్సీలో బాక్సైజ్ తవ్వకాలు, గంజాయి సాగుపై వున్న శ్రద్ధ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై లేకపోవడం శోచనీయమన్నారు.

బ్యాంకులకు రూ.200 కోట్లు ఎగనామం పెట్టి దాని నుంచి బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న మరో మంత్రి గంటా ప్రత్యేకహోదా, జోన్ అంశాలపై చూపకపోవడం ఉత్తరాంధ్రవాసుల దురదృష్టమని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.
ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌పై ఓటుకు నోటు కేసుకు భయపడి సీఎం చంద్రబాబు నోరు మెదపడంలేదని మండిపడ్డారు. ఫిరాయించే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించాలని రోజా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications