లీకేజీ, ఆత్మహత్యల్లో ‘నారాయణే’ నెం.1, గంటా ఏం చేస్తున్నారు: రోజా నిప్పులు

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యావ్యవస్థను వీరిద్దరు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్ష పేపర్లు లీకేజీ జరుగుతుంటే గంటా శ్రీనివాసరావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

మంగళవారం ఉదయం రోజా మాట్లాడారు. నీతి, నిజాయితీ ఉంటే గంటా శ్రీనివాసరావు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష పేపర్ల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యల్లో నారయణ విద్యాసంస్థలే నెంబర్ వన్ అని రోజా ఆరోపించారు.

పరీక్ష పేపర్ల లీకేజీ వెనక మంత్రి నారాయణ హస్తముందని వైసీపీ నేత అనిల్ కుమార్ ఆరోపించారు. లీకేజీపై జరిగిన దర్యాప్తును బయటపెట్టాలని అన్నారు. దర్యాప్తులో పేపర్ లీకైందని తేలిందని అన్నారు. 4వేలకు పైగా నారాయణ స్కూళ్లలో ఈ లీకేజీ జరిగిందని ఆయన ఆరోపించారు.

Roja fires at Minister Ganta and Naryana

పరీక్ష పేపర్ల లీకేజీపై సీఐడీ విచారణ జరిపించాలని మరో నేత సురేష్ ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలు నారాయణ విద్యా సంస్థల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.

లీకేజీ అవాస్తవం

పేపర్ లీకేజీ అవాస్తవమని, విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. నారాయణ సంస్థలను అప్రతిష్టపాలు చేసేందుకే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLA Rk Roja on Teusday fired at Andhra Pradesh Minister Ganta Srinivas Rao and Naryana for exam paper laekage issue.
Please Wait while comments are loading...