వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ చందమామ అందరికీ తెలుసు.. మెంటల్ చంద్రబాబు, లోకేష్ లకే : రోజా ధ్వజం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా ... చూస్తూ ఊరుకోం : నారా లోకేష్ హెచ్చరికపరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా ... చూస్తూ ఊరుకోం : నారా లోకేష్ హెచ్చరిక

తిన్నది అరక్క చంద్రబాబు, లోకేష్ ల విమర్శలు

తిన్నది అరక్క చంద్రబాబు, లోకేష్ ల విమర్శలు

చంద్రబాబుకు ,లోకేష్ కు ఏం మాట్లాడడానికి విషయాలు లేక ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారు అని రోజా మండిపడ్డారు. తిన్నది అరక్క చంద్రబాబు, లోకేష్ విమర్శలు చేస్తున్నారని వారికి రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా అంటూ రోజా విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పరీక్షలు జరుపుతామని కానీ, జరపమని కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని, లోకేష్ ఈ విషయం గుర్తించకుండా నానా హంగామా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

తనలాగే మొద్దుల్లా విద్యార్థులను తయారు చెయ్యాలనుకుంటున్న లోకేష్

తనలాగే మొద్దుల్లా విద్యార్థులను తయారు చెయ్యాలనుకుంటున్న లోకేష్

లోకేష్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులను కూడా చదువు, సంధ్యలు లేకుండా మొద్దుల్లాగా తయారు చేయాలని కోరుకుంటున్నారని రోజా ఫైర్ అయ్యారు. పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం పరీక్షలు జరిపే సమయం కోసం సీఎం జగన్ ఎదురుచూస్తున్నారని రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు బాగా తగ్గిన తర్వాత కూడా పరీక్షలు జరపడం అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 6 శాతానికి వచ్చిందని పేర్కొన్న రోజా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పరీక్షలు జరిపితే వారికి నాణ్యమైన విద్యను అందించిన వారమవుతాము అని పేర్కొన్నారు.

పరీక్షలు లేకుంటే లోకేష్ వంటి మొద్దులకు ఓకే

పరీక్షలు లేకుంటే లోకేష్ వంటి మొద్దులకు ఓకే


నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఇంటర్ చదువే ప్రాతిపదిక అని పేర్కొన్న రోజా పరీక్షలను రద్దు చేస్తే విద్యార్థుల్లో ఉదాసీన వైఖరి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. పరీక్షలు లేకపోతే లోకేష్ వంటి ముద్దు పిల్లలు సంతోష పడతారు కానీ, బాగా చదివే పిల్లలు పరీక్షలు లేకపోతే ఎంత బాధ పడతారు ఒక్కసారి ఆలోచించాలని రోజా సూచించారు. జగన్ పైన మెంటల్ మామ అంటూ విమర్శలు చేస్తూ ఉండటం పైన కూడా స్పందించిన రోజా తనదైన సమాధానం ఇచ్చారు.

Recommended Video

YSRCP MLA Roja : డిశ్చార్జ్‌ తర్వాత తొలిసారి కనిపించి.. దుమ్మురేపాలని కోరిన రోజా VIDEO
 జగన్ ఏమిటో అందరికీ తెలుసు

జగన్ ఏమిటో అందరికీ తెలుసు

జగన్ మెంటల్ మామనో, చందమామనో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. చందమామ లాంటి జగన్ ను విద్యార్థులు ఎంతో ఆప్యాయంగా మామ అని పిలుచుకుంటారు అని పేర్కొన్నారు. ఇక మెంటల్ అనేది చంద్రబాబు, లోకేష్ లకు వర్తిస్తుందని విమర్శలను తిప్పికొట్టారు రోజా . ప్రతి చిన్న విషయానికి టీడీపీ నేతలకు రాద్ధాంతం చెయ్యటం అలవాటుగా మారిందని మండిపడ్డారు .

English summary
Roja was incensed that Chandrababu and Lokesh were raising issues that thay has no work to do and nothing to talk about. Roja Criticised Chandrababu and Lokesh that they had no responsibility towards the state. jagan like moon , students very affectionately called mama . Roja refuted the criticism that mental applies to Chandrababu and Lokesh.He was incensed that it had become a habit for TDP leaders to comment on every little thing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X